AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Firewall 2026: ఒక్క కాల్‌తో దేశ రహస్యాల వేట.. హనీ ట్రాప్‌తో రక్షణ సమాచారమే టార్గెట్.. 10 రాష్ట్రాల్లో స్పై నెట్‌వర్క్ గుట్టురట్టు!

Operation Firewall 2026: అక్టోబర్ 1న చేపట్టిన సమన్వయ ఆపరేషన్‌లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 12 కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్ ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. రాష్ట్ర పోలీసులు..

Operation Firewall 2026: ఒక్క కాల్‌తో దేశ రహస్యాల వేట.. హనీ ట్రాప్‌తో రక్షణ సమాచారమే టార్గెట్.. 10 రాష్ట్రాల్లో స్పై నెట్‌వర్క్ గుట్టురట్టు!
Operation Firewall 2026
Siva Nagaraju
| Edited By: |

Updated on: Oct 07, 2026 | 9:50 PM

Share

Operation Firewall 2026: దేశ రహస్యాలు అంటే సరిహద్దులు దాటి వెళ్లే గూఢచారులే గుర్తుకు వస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక మొబైల్ ఫోన్‌లోకి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్. ఆ తర్వాత పరిచయం. కొద్దిరోజులకు చాటింగ్. ఆపై వీడియో కాల్. చివరికి చిన్న సమాచారం. ఇంతటితో కథ ముగిసిపోదు. ఆ చిన్న సమాచారం మరో సమాచారంతో కలిస్తే అది పెద్ద రహస్యంగా మారొచ్చు. ఆపరేషన్ ఫైర్‌వాల్–2026 దర్యాప్తు బయటకు తీసుకొస్తున్నది ఇలాంటి డిజిటల్ గూఢచర్యం తీరునే. పాకిస్థాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో 18 మందిని కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు స్కానర్‌లోకి తీసుకొచ్చారు. వీరిలో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మిగిలిన 16 మందికి సంబంధించిన ఫోన్ కాల్స్, చాటింగ్, డిజిటల్ పరికరాలు, డబ్బు లావాదేవీలు, విదేశీ పరిచయాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అక్టోబర్ 1న చేపట్టిన సమన్వయ ఆపరేషన్‌లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 12 కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, గోవా, ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్ ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. రాష్ట్ర పోలీసులు, ఏటీఎస్, నేవీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు కలిసి ఈ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నాయి. విశాఖ కేంద్రంగా రక్షణ సమాచారంపై కన్ను ఈ మొత్తం వ్యవహారంలో విశాఖపట్నం కీలకంగా మారింది. తూర్పు తీరంలో నేవీకి ముఖ్యమైన స్థావరాలు...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి