AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Old Newspaper: అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న పాత న్యూస్ పేపర్లు.. కేజీ ధర తెలిస్తే షాకే..

Old Newspaper Price: పాత న్యూస్ పేపరే అంటూ పారేయకండి.. దానికి విలువ చాలానే ఉంది.. ఒకప్పుడు కేజీ రూ.10కి కూడా అమ్ముడు పోని.. పాత న్యూస్ పేపర్ ఇప్పుడు ఎంతనుకుంటున్నారు..

Old Newspaper: అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న పాత న్యూస్ పేపర్లు.. కేజీ ధర తెలిస్తే షాకే..
News Paper
Shaik Madar Saheb
|

Updated on: Dec 01, 2021 | 6:58 PM

Share

Old Newspaper Price: పాత న్యూస్ పేపరే అంటూ పారేయకండి.. దానికి విలువ చాలానే ఉంది.. ఒకప్పుడు కేజీ రూ.10కి కూడా అమ్ముడు పోని.. పాత న్యూస్ పేపర్ ఇప్పుడు ఎంతనుకుంటున్నారు.. అక్షరాల యాభై రూపాయలు.. ఎందుకు అంత రేటంటారా.. గుంటూరులో అంతే అంతే అంటున్నారు వ్యాపారస్థులు. కార్పొరేషన్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయంతో పాత న్యూస్ పేపర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దీంతో పాత పేపర్ల ధరలు అమాంతం పెరిగినట్లు వ్యాపారస్థులు పేర్కొంటున్నారు. గతంలో కేజీ పది పదిహేను రూపాయలున్న ధర ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు పెరిగి యాభై రూపాయలకు చేరుకుంది. కార్పోరేషన్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగంపై నిషేధం విధించింది. నిషేధం విధించడమే కాకుండా పక్కగా అమలు చేస్తుంది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తయారు చేస్తే 50 వేల రూపాయలు, రిటైల్ గా విక్రయిస్తే 2,500 నుంచి 15 వేల రూపాయలు, క్యారీ చేస్తే 250 నుంచి 500 రూపాయలు ఫైన్ విధిస్తుంది.

అంతేకాకుండా కార్పోరేషన్ పరిధిలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కచ్చితంగా అమలు చేస్తోంది. దీంతో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం తగ్గిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా చిరు వ్యాపారులంతా పాత పేపర్లనే వినియోగిస్తానన్నారు. అరటి పళ్ళు, జామ కాయలతో పాటు ఇతర పండ్లు విక్రయించే వారంతా పేపర్లు, పేపర్ కవర్సే వినియోగిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా పాత న్యూస్ పేపర్ల ధరలు పెరిగిపోయాయి. దీంతో వాటిని సేకరించే వారి సంఖ్య పెరిగింది. అయితే.. ఒకప్పుడు పాత న్యూస్ పేపర్లను ఎవరూ పట్టించుకునే వారు కాదని.. ఇప్పుడు గుంటూరులో వాటికి భారీ గిరాకీ ఉందని పేర్కొంటున్నారు. దీంతో వ్యాపారస్థులు ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరలకు దిగుమతి చేసుకుంటున్నారని పేర్కొంటున్నారు.

నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు జిల్లా

Also Read:

జమ్మూకశ్మీర్‌లో గత నాలుగేళ్లలో ఎంతమంది జవాన్లు, సామాన్యులు చనిపోయారో తెలుసా? వివరాలు వెల్లడించిన కేంద్రం హోంశాఖ

IMD Prediction: డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు..

ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!