AP: 5 ముఖాలు కలిగిన పురాతన వినాయక విగ్రహం.. 25 కోట్ల వ్యవహారం.. ప్రకాశం జిల్లాలో కలకలం..!

అది అత్యంత పురాతనమైన విగ్రహం. దాని విలువ పాతిక కోట్ల రూపాయలపైనే. పంచ ముఖాల కలిగిన మరకత విగ్రహం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతోంది.

AP: 5 ముఖాలు కలిగిన పురాతన వినాయక విగ్రహం.. 25 కోట్ల వ్యవహారం.. ప్రకాశం జిల్లాలో  కలకలం..!
Ancient Lord Balaji Idol
Follow us

|

Updated on: Jun 12, 2022 | 12:42 PM

Prakasam District: ప్రకాశం జిల్లాలో మరకత విగ్రహం టాక్‌ ఆఫ్‌ ది డిస్ట్రిక్ట్‌గా మారింది. అత్యంత పురాతన మరకత విగ్రహం పట్టుబడిందన్న వార్త జిల్లాలో సంచలనంగా మారింది. యర్రగొండపాలెం(Yerragondapalem)లో ఐదు ముఖాలు కలిగిన పురాతన వినాయక విగ్రహం దొరికినట్లు తెలుస్తోంది. పంచ ముఖాలు కలిగిన ఈ మరకత విగ్రహాన్ని 25 కోట్ల రూపాయలకు అమ్మేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విగ్రహాన్ని అమ్మేందుకు ప్రయత్నించింది కూడా సామాన్యులు కాదని తెలుస్తోంది. ప్రముఖ వ్యక్తులే ఈ మరకత విగ్రహాన్ని పాతిక కోట్ల రూపాయలకు అమ్మేందుకు బేరసారాలు చేయడంతో ఇది బయటపడిందని అంటున్నారు. మరకత విగ్రహంపై లావాదేవీలు జరుపుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు, వాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఈ మరకత విగ్రహం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో సంచలనం రేపుతోంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్లంతా ప్రముఖులే కావడంతో గుట్టుగా ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. పక్కా సమాచారంతో నిఘా అధికారులు వాళ్లను పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పొలిటీషియన్స్ పైరవీలతో ఆ మరకత విగ్రహాన్ని యర్రగొండపాలెం పోలీసులకు అప్పగించి వెళ్లిపోయినట్లు టాక్‌ వినిపిస్తోంది. కోట్ల రూపాయలు విలువచేసే ఈ మరకత విగ్రహం ప్రస్తుతం యర్రగొండపాలెం పోలీస్‌స్టేషన్‌ ఉందని చెబుతున్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత ఫుల్‌ డిటైల్స్‌ వెల్లడిస్తామని అంటున్నారు పోలీసులు.

ఇంకా ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి