AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema Corona: థర్డ్ వేవ్ వస్తోందోచ్.. కోనసీమలో మళ్లీ కరోనా పంజా.. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు

ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసుల పెరుగుదల కలకలం రేపుతోంది. పాజిటివిటి తగ్గుతోందని అంతా భావించినా, ఆ ప్రాంతంలో మాత్రం వ్యాప్తి తగ్గడంలేదు. దీంతో అధికారులు నివారణ చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి, ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Konaseema Corona: థర్డ్ వేవ్ వస్తోందోచ్.. కోనసీమలో మళ్లీ కరోనా పంజా.. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు
Konaseema Corona
Sanjay Kasula
|

Updated on: Jul 21, 2021 | 10:12 PM

Share

ఎంతో అందంగా ఉండే కోనసీమ, ఇప్పుడు కరోనా కోరల్లో చిక్కుకుంది. కోనసీమలో మళ్లీ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రం అంతా పాజిటివ్ కేసులు తగ్గినా, కోనసీమ ప్రాంతంలో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. కరోనా నివారణ చర్యలు చేపట్టారు. కొవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. థర్డ్ వేవ్ బారిన పడకుండా ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. గతంలోనే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని పోలీసులు గుర్తుచేస్తున్నారు.

భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు రావొద్దంటే, ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. కచ్చితంగా మాస్క్ ధరించాలని స్పష్టం చేస్తున్నారు. భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు. అటు కోనసీమలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా పి.గన్నవరం మండలంలో పలుచోట్ల కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.

కరోనా విజృంభణ, అధికంగా ఉన్న పాజిటివ్ రేట్ దృష్య్టా వారంరోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతినిచ్చారు. వారం రోజులు కర్ఫ్యూ కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రభుత్వం కూడా కరోనా కేసుల పెరుగుదలపై సీరియస్‌గా ఉంది. కొవిడ్‌పై ఇటీవల సీఎం జగన్ చేసిన రివ్యూలోనూ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. నిర్లక్ష్యంగా ఉండొద్దని థర్డ్ వేవ్ వచ్చినా సమర్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. మరోవైపు కొత్తగా ఏర్పాటు చేసే ఆసుపత్రులపైనా ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు.

వీలైనంత తొందరగా ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందన్న అంచనాల నేపథ్యంలో, వైద్యులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసుపత్రుల్లో ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఇవి కూడా చదవండి: TTD: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అర్చకుల శాశ్వత నియామకంపై ఏక సభ్య కమిటీ

Valuable Wood: ఎర్రచందనంను మించిన ధర.. ప్రంపచంలోనే అత్యంత ఖరీదైన కలప ఇదే..