Andhrapradesh: విద్యారంగంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కాలేజీలకు జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రాలే

విద్యారంగంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అటానమస్ కాలేజీల్లో పరీక్షా విధానంలో మార్పులు చేసింది.

Andhrapradesh: విద్యారంగంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కాలేజీలకు జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రాలే
AP CM Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 25, 2021 | 7:40 PM

విద్యారంగంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అటానమస్ కాలేజీల్లో పరీక్షా విధానంలో మార్పులు చేసింది. సొంతంగా ప్రశ్నాపత్రాలు తయారు చేసుకునే విధానం రద్దు చేసింది. అన్ని కాలేజీలకు జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రాలే ఉపయోగించాలని సర్కార్ నిర్ణయించింది. అటానమస్‌తో పాటు నాన్-అటానమస్ కాలేజీలకు కూడా జేఎన్‌టీయూ ప్రశ్నాపత్రాలే ఉపయోగించనున్నారు. ప్రశ్నాపత్రాల వాల్యువేషన్ కూడా జేఎన్‌టీయూకే అప్పగించింది. పరీక్షల్లో అక్రమాల నిరోధానికే ఈ చర్యలు తీసుకున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. కాగా ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిగ్రీలు సాధించిన తర్వాత ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉండాలన్నారు. నైపుణ్యాలు లేకుండా ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోలేం అని చెప్పారు. ప్రతి విద్యార్థి నైపుణ్యం,  పరిజ్ఞానంతో ముందుకు రావాలని సూచించారు. కనీస అనుభవం, పరిజ్ఞానం లేని డిగ్రీలకు ఎక్కడా విలువ ఉండదని అభిప్రాయపడ్డారు.  కాగా ప్రతి కోర్సులో అప్రెంటీస్ విధానం తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కాగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్య, వైద్యం విషయంలో సీఎం జగన్ తన మార్క్ చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘నాడు-నేడు’ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్ రూపురేఖలు మార్చేశారు. ‘అమ్మఒడి’,  ‘జగనన్న విద్యా దీవెన’ , ‘వసతి దీవెన’ వంటి పథకాలను ప్రవేశపెట్టారు. అంతేకాదు ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్షిప్స్ విషయంలో కూడా రాజీ లేకుండా ముందుకు వెళ్తున్నారు. కాగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తుంది.

Also Read: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం.. ఏప్రిల్ 6న నిధుల విడుదల

వంగపండు కుటుంబానికి భారీ ఆర్థిక సాయం విడుదల.. ఆయన పేరుతో ఇకపై జానపద పురస్కారం