Vangapandu: వంగపండు కుటుంబానికి భారీ ఆర్థిక సాయం విడుదల.. ఆయన పేరుతో ఇకపై జానపద పురస్కారం
ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరొందిన ప్రముఖ ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు గత ఏడాది అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరొందిన ప్రముఖ ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు గత ఏడాది అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ప్రజా కళాకారుడి వారసులకు ఈ మొత్తాన్ని చెల్లించాలని సాంస్కృతిక శాఖను జగన్ సర్కార్ ఆదేశించింది. వంగపండు ప్రసాదరావు గత ఏడాది ఆగస్ట్ 4న విజయనగరం జిల్లా పార్వతీపురంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం కూడా వంగపండు అందుకున్నారు. వంగపండు 300కి పైగా జాపపదాలు రచించించారు. బాణీ కట్టి, తానే స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి, పాడే వంగపండు తెలియనివారు ఎవరూ ఉండరు. వంగపండు ప్రసాదరావు 1943లో జన్మించారు. పార్వతీపురం దగ్గర్లోని పెదబొండపల్లి ఆయన స్వగ్రామం. ‘‘ఏం పిల్లడో ఎల్దమొస్తవ.. ఏం పిల్లో ఎల్దమొస్తవా’’ అంటూ ఆయన రాసి, పాడిన పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన జీవితమంతా ప్రజా ఉద్యమాలు, జానపద కళలకే వెచ్చించిన వంగపండు తుదిశ్వాస వరకు అత్యంత సాధారణ జీవితం గడిపారు. వంగపండు చనిపోయినప్పడు ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్‌లు సంతాపం ప్రకటించారు.
వంగపండు జానపద పురస్కారం ఏర్పాటు
ఏపీ సర్కార్ వంగపండు జానపద పురస్కారం ఏర్పాటు చేసింది. ఎంపికైన వారికి రూ.2 లక్షల నగదు బహుమానం, ప్రశంసాపత్రం ఇవ్వనున్నారు. ఏటా వంగపండు వర్థంతి అయిన ఆగస్టు 4న పురస్కారం ఇవ్వనున్నట్లు సాంస్కృతిక శాఖ తెలిపింది.
Also Read: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం.. ఏప్రిల్ 6న నిధుల విడుదల
ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవి.. పూర్తి వివరాలు