AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

East Godavari: ఇలాంటి జడలు వేసుకున్న అమ్మాయిలు మీకు రోడ్డు మీద కనిపిస్తే జర జాగ్రత్త

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నార్త్ అమ్మాయిలు రెచ్చిపోతున్నారు. విరాళాల పేరుతో వాహనదారుల నుండి డబ్బులు బలవంతంగా వసూలు చేస్తున్నారు.

East Godavari: ఇలాంటి జడలు వేసుకున్న అమ్మాయిలు మీకు రోడ్డు మీద కనిపిస్తే జర జాగ్రత్త
North Girls
Ram Naramaneni
|

Updated on: Dec 12, 2022 | 4:54 PM

Share

అవే బెదిరింపులు.. సేమ్ టూ సేమ్ అలాంటి యువతులే. విరాళాల పేరుతో ఆగడాలు.. పోలీసులకు పట్టుబడితే ప్లేసులు మార్చడాలు.  ఈ అమ్మాయిలు మాములోళ్లు కాదు గురూ. గతంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వీళ్లు న్యూసెన్స్ క్రియేట్ చేశారు.  ఇప్పుడు రాజమండ్రి పరిసరాల్లో హల్ చల్ చేస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉత్తరాధికి చెందిన అమ్మాయిలు రెచ్చిపోతున్నారు. విరాళాల పేరుతో వాహనదారుల నుండి డబ్బులు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ధవలేశ్వరం, కడియంతో సహా పలు నిర్మానుష్య ప్రాంతాల్లో వసూళ్లకు పాల్పడుతూ వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు. 500 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే బెదిరింపులకు పాల్పడుతూ హిందీలో దుర్భాషలాడుతున్నారు. గత రెండు మూడు రోజులుగా వీరి ఆగడాలకు చాలా మంది వాహనదారులు బలయ్యారు. చివరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు వాహనదారులు.

చూడ్డానికి జీన్స్, టీ షర్ట్ లలో చాలా బ్యూటీఫుల్‌గా కనిపిస్తారు. వాహనాలు ఆపుతారు. అసలు ఏంటి విషయం అని అడిగేలోపే చేతిలో ఓ కాగితం పెడతారు. డబ్బులు ఇవ్వమని అడుగుతారు. ఇచ్చేవరకు వదిలిపెట్టరు. ఇవ్వకపోతే తిడతారు. ఎలాగోలా తప్పించుకుని వద్దామనుకుంటే.. గట్టిగా బూతులు తిడతారు. ఇద్దరు ముగ్గురు కాదు.. ఏకంగా 10, 15 మంది గుంపులుగా కనిపిస్తారు. వారి హెయిర్ ఎక్కువగా బ్రౌన్ కలర్‌లో ఉంటుంది. జడ అల్లే విధానం కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలాంటి వాళ్లు మీకు ఎక్కడైనా తారసపడితే తస్మాత్ జాగ్రత్త గురూ..!

వీరంతా లాడ్జిల్లో మకాం వేసి.. నిర్మానుష్య ప్రాంతాలను.. సిటీ శివార్లను ఎంచుకుంటున్నట్లు గతంలో పోలీసులు గుర్తించారు. అప్పుడు వార్నింగ్ ఇచ్చి సొంతూర్లకు పంపించేశారు. తాజాగా ఈ గ్యాంగ్ మరోసారి యాక్షన్‌లోకి దిగడంతో.. వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..