Srisailam: అపచారం శ్రీశైలంలో మద్యం, మాంసం.. పోలీసులకు సమాచారం.. అధికారులు తనిఖీలు

| Edited By: Surya Kala

Feb 04, 2024 | 3:11 PM

హిందువులు పవిత్రమైన పర్వదినాలు, పండగలు వంటి రోజుల్లో మాత్రమే కాదు.. పవిత్ర క్షేత్ర దర్శన సమయంలో కూడా ఆహార నియమాలను పాటిస్తారు. పవిత్ర క్షేత్రాల్లోని అన్న సమర్పణలో తయారు చేసే ఆహార పదార్ధాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాన్ని వినియోగించకుండా తయారు చేస్తారు. అయితే తాజాగా పవిత్ర శ్రీశైలంలోకి మద్యం మాంసం వస్తున్నాయనే సమాచారం పోలీసులకు అందింది.

Srisailam: అపచారం శ్రీశైలంలో మద్యం, మాంసం.. పోలీసులకు సమాచారం.. అధికారులు తనిఖీలు
Srisailam Check Post
Follow us on

హిందువులు పవిత్రమైన పర్వదినాలు, పండగలు వంటి రోజుల్లో మాత్రమే కాదు.. పవిత్ర క్షేత్ర దర్శన సమయంలో కూడా ఆహార నియమాలను పాటిస్తారు. పవిత్ర క్షేత్రాల్లోని అన్న సమర్పణలో తయారు చేసే ఆహార పదార్ధాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాన్ని వినియోగించకుండా తయారు చేస్తారు. అయితే తాజాగా పవిత్ర శ్రీశైలంలోకి మద్యం మాంసం వస్తున్నాయనే సమాచారం పోలీసులకు అందింది. కొందరు వ్యక్తులు టోల్గేట్ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు బైక్ లపై మద్యం, మాంసం తరలిస్తున్నారని సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం టోల్ గేట్ వద్ద సర్కిల్ సిఐ ప్రసాదరావు, ఎస్సై లక్ష్మణరావు పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. దేవస్థానం పరిధిలోకి మద్యం, మాంసం వినియోగంపై నిషేధం ఉంది. అయితే కొందరు వ్యక్తులు బైక్స్ పై వాహనాలలో జీబులలో మద్యం, మాంసం క్షేత్ర పరిధిలోకి తీసుకువస్తున్నారని సమాచారంతో ఉదయం నుండి సిఐ, ఎస్సై పోలీసు సిబ్బందితో తనిఖీ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

వాహనాల తనిఖీలలో భాగంగా వాహనాల ఆయా రికార్డుల పరిశీలన చేస్తూ సరైన వాహన రికార్డు లేనివారికి జరిమానాలు విధించారు. క్షేత్ర పరిధిలో  అక్రమ మద్యం మాంసాహార రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని ఎవరైనా ఎంతటి వారైనా క్షేత్రపరిధిలో రూల్స్ అతిక్రమించి మద్యం, మాంసం తీసుకువస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారు ఎంతటి వారైనా కేసులు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడతామని సిఐ ప్రసాదరావు, ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..