White Tiger Kumari: తెల్లపులి కుమారి ఇక లేదు.. విశాఖ జూ లో వైట్ టైగర్ “కుమారి” మృతి
ఎన్‌క్లోజరులో హుషారుగా తిరుగుతూ చెట్లు ఎక్కుతూ, పరుగెత్తుతూ సందర్శకులకు కనువిందు చేసేది కుమారి. ఓ వైపు వృద్ధాప్యం, మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న కుమారిని ఎంత శ్రద్ధగా చూసుకునేవారు జూ పిబ్బంది. కుమారి దూరం కావడంతో జూ అధికారులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ జూపార్క్‌లో సందర్శకులకు కనువిందు చేసే తెల్లపులి ఇక లేదు. ఇందిరాగాంధీ జూపార్క్‌లో కుమారి అనే 19 ఏళ్ల తెల్లపులి మే 8న అనారోగ్యంతో మృతి చెందింది. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కులో సుమారు 16 సంవత్సరాలు పాటు సందర్శకులను అలరించిన వైట్ టైగర్ 9 పిల్లలకు జన్మనిచ్చింది. ఎన్‌క్లోజరులో హుషారుగా తిరుగుతూ చెట్లు ఎక్కుతూ, పరుగెత్తుతూ సందర్శకులకు కనువిందు చేసేది కుమారి. ఓ వైపు వృద్ధాప్యం, మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న కుమారిని ఎంత శ్రద్ధగా చూసుకునేవారు జూ పిబ్బంది. కుమారి దూరం కావడంతో జూ అధికారులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు.
జూ అధికారులు 2007లో హైదరాబాద్‌లో నెహ్రూ జూలాజికల్ పార్కు నుంచి కుమారితో పాటు మరో మగ తెల్ల పులిని విశాఖ ఇందిరాగాంధీ జూపార్క్‌కు తీసుకొచ్చారు. ఇప్పటివరకూ మూడు సార్లు గర్భం దాల్చిన కుమారి మొత్తం 9 కూనలకు జన్మనిచ్చి జూలో వాటి సంతతిని పెంచింది. వృద్ధాప్యం కారణంగా కొన్ని అవయవాలు కూడా పనిచేయకపోవడంతో కుమారి మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైనట్లు ఇన్‌చార్జి క్యూరేటర్, ఏసీఎఫ్ మంగమ్మ తెలిపారు. కుమారి మృతితో ప్రస్తుతం జూలో ఐదు తెల్ల పులులున్నట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..