CM Jagan: ప్రజలకు సేవ అందించేందుకే నేను ఈ స్థానంలో ఉన్నాను.. ‘జగనన్నకు చెబుదాం’కు సీఎం జగన్ శ్రీకారం..
‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్.1902కు ఫోన్ కొడితే… నేరుగా సీఎంఓకే ఫోన్ వస్తుంది. పరిష్కారం ఈ స్థాయిలో చూపించే గొప్ప ఆలోచనకు అడుగులు వేస్తున్నాం. మీరు ప్రయత్నంచేసినా పరిష్కారం కాని సమస్యలు నేరుగా నా దృష్టికే వస్తాయన్నారు సీఎం జగన్.
సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపేలా తపన, తాపత్రయంతో పుట్టకొచ్చిన ఆలోచన జగనన్నకు చెబుదాంను ప్రారంభించారు. అర్హత ఉన్నా.. రాని పరిస్థితులు ఉన్నాయన్నారు. న్యాయం మీ వైపున ఉన్నా.. జరగని పరిస్థితులు ఉన్నా.. 1902 కి కాల్ చేయవచ్చన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం మిగతా కార్యక్రమాలకంటే భిన్నమైనదన్నారు.
గతంలో ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా.. ప్రతి అడుగులోనూ వివక్ష, లంచాలు కనిపించేవి. వ్యవస్థల్లోకి లంచాలు, వివక్షలేని గొప్ప మార్పులను తీసుకు వచ్చాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మార్పులు తీసుకు వచ్చాం. స్పందనకు మరింత మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు సీఎం జగన్.
మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని స్థాయిల్లో అందర్నీ భాగస్వాములను చేస్తున్నాం. 1902కు ఫోన్ కొడితే… నేరుగా సీఎంఓకే ఫోన్ వస్తుంది. పరిష్కారం ఈ స్థాయిలో చూపించే గొప్ప ఆలోచనకు అడుగులు వేస్తున్నాం. మీరు ప్రయత్నంచేసినా పరిష్కారం కాని సమస్యలు నేరుగా నా దృష్టికే వస్తాయన్నారు సీఎం జగన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం