Child Kidnap: మూడు రోజులుగా కనిపించకుండాపోయిన చిన్నారి.. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా.. వారికి పిల్లలు కలగలేదు.. సంతానం లేని కారణంగా బంధువుల నుంచి అమూల్య అనే పాపను ఏడేళ్ళ క్రితం దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు ఆ దంపతులు. పెళ్ళైన పదహారేళ్ళకు ఆ దంపతులకు ఓ పాప పుట్టింది. తొమ్మిది నెలల క్రితం ఆడపిల్ల నిరీక్ష పుట్టడంతో ఇద్దరినీ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా.. వారికి పిల్లలు కలగలేదు.. సంతానం లేని కారణంగా బంధువుల నుంచి అమూల్య అనే పాపను ఏడేళ్ళ క్రితం దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు ఆ దంపతులు. పెళ్ళైన పదహారేళ్ళకు ఆ దంపతులకు ఓ పాప పుట్టింది. తొమ్మిది నెలల క్రితం ఆడపిల్ల నిరీక్ష పుట్టడంతో ఇద్దరినీ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే మళ్ళీ వీరి పట్ల విధి చిన్నచూపు చూసింది. తొమ్మిది నెలల ఆ పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళారు. దీంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బాతులు పెంచుకుంటూ సంచార జీవనం సాగించే దంపతుల దగ్గరకు మూడు రోజుల క్రితం అదివారం రాత్రి 11 గంటల సమయంలో మంచినీళ్లు కావాలని వచ్చిన ఓ జంట పసిపాపను కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు… కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు రోజులైనా పాప ఆచూకీ లభించకపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు…
నెల్లూరు జిల్లా గుడ్లూరు గ్రామానికి చెందిన దేవరకొండ ఆనంద్, రజని దంపతులు బాతులు పెంచుకుంటూ సంచార జీవనం చేస్తుంటారు… ఈ క్రమంలో ఒంగోలులోని అగ్రహారం గేటు దగ్గర టెంటు వేసుకుని కొద్దిరోజులుగా ఉంటున్నారు. ఈక్రమంలో మూడు రోజుల క్రితం రాత్రి 11 గంటల సమయంలో ఆనంద్, రజని నిద్రిస్తుండగా స్కూటీపై వచ్చిన ఓ జంట మంచి నీళ్లు కావాలని అడిగారు. దీంతదో రజని లోపలికి వెళ్ళి నీళ్ళు తెచ్చింది. అయితే అక్కడ నీళ్లు అడిగిన వ్యక్తి లేడు.. భర్త పక్కనే నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారి నిరీక్ష కూడా కనిపించలేదు. అక్కడ అతనితో పాటు వచ్చిన మహిళ, స్కూటీ కనిపించలేదు. దీంతో గుండెలు బాదుకుంటూ రజని బయటకు వచ్చి చూసింది.
ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చేలోపు అక్కడే మంచంపై నిద్రిస్తున్న 9 నెలల చిన్నారి నిరీక్షను గుర్తు తెలియని జంట ఎత్తుకెళ్ళినట్టు భర్త, బంధువులకు సమాచారం ఇచ్చింది రజని. వారి కోసం ఎంతసేపు గాలించినా ఫలితం లేకుండా పోయింది. తన బిడ్డ కిడ్నాప్‌కు గురైందని గ్రహించిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చివరికి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు..
పదహారేళ్ల క్రితం వివాహమైన ఆనంద్, రజని దంపతులకు తొమ్మిది నెలల క్రితం పాప నిరీక్ష పుట్టింది. తమకు పిల్లలు లేరనే కారణంతో ఏడేళ్ల క్రితం బంధువుల దగ్గర నుంచి అమూల్య అనే పాపను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఆ బాలిక కూడా ప్రస్తుతం వీళ్ళ దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో నిరీక్ష కిడ్నాప్ కావడంతో ఎవరు ఎత్తుకెళ్ళారో అర్ధంకాక ఆ దంపతులు మూడు రోజుల నుంచి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ పాప ఆచూకీని కనిపెట్టి తమకు అప్పగించాలని పోలీసులను వేడుకుంటున్నారు…
కిడ్నాపర్ల కోసం ప్రత్యేక బృందాలు…
తొమ్మిది నెలల చిన్నారి నిరీక్ష కిడ్నాప్ కావడంతో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, తాలూకా సిఐ భక్తవత్సలరెడ్డి పరిశీలించారు. కిడ్నాప్‌నకు గురైన పాప నిరీక్ష కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దించామని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కాల్‌డేటా, ఇతర సాంకేతికపరమైన అంశాలతో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే కిడ్నాపర్లను పట్టుకుంటామని ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి చెబుతున్నారు. మూ డురోజులైనా పాప ఆచూకీ లభించకపోవడంతో పాప తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..