Andhra Pradesh: చంద్రబాబుకు నూతన వధూవరుల సంఘీభావం.. ప్లకార్డులు చూపుతూ గుంటూరులో పెళ్లి వేడుక

|

Oct 22, 2023 | 7:43 AM

చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని ఆయనకు సంఘీభావం తెలిపేందుకు తాము ఇలా చేసినట్లు త్రినాథ్, భాను కుటుంబసభ్యులు తెలిపారు. నూతన వధువరులిద్దరూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నవ్వులు చిందించారు. పెళ్లికి హాజరైన పెద్దలు, పిల్లలు కూడా బాబుతో నేను అంటూ ప్లకార్డుతో నిరసన తెలిపారు.

Andhra Pradesh: చంద్రబాబుకు నూతన వధూవరుల సంఘీభావం.. ప్లకార్డులు చూపుతూ గుంటూరులో పెళ్లి వేడుక
Married Couple Support To Chandrababu
Follow us on

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు చంద్రబాబును సెప్టెంబర్ 9న అరెస్ట్ చేశారు.  ఏసీబీ కోర్టు చంద్రబాబుకి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు చంద్రబాబు.  ఈ నేపథ్యంలో చంద్రబాబు కు అండగా మేము సైతం అంటోంది ఓ కొత్త జంట. గుంటూరులో జరిగిన ఓ వివాహ వేడుకలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా వధూవరులు ప్లకార్డులు పట్టుకుని సంఘీభావం తెలిపారు. గుంటూరులోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో మూడు రోజుల క్రితం కొల్లా త్రినాథ్, మన్నవ భాను అనే ఇద్దరు యువతీయువకుల వివాహం జరిగింది.

ఈ సందర్భంగా.. వధూవరులతో పాటు కుటుంబసభ్యులంతా చంద్రబాబుతో నేను ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని ఆయనకు సంఘీభావం తెలిపేందుకు తాము ఇలా చేసినట్లు త్రినాథ్, భాను కుటుంబసభ్యులు తెలిపారు. నూతన వధువరులిద్దరూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నవ్వులు చిందించారు. పెళ్లికి హాజరైన పెద్దలు, పిల్లలు కూడా బాబుతో నేను అంటూ ప్లకార్డుతో నిరసన తెలిపారు.

అలాగే.. దేశం గర్వించదగ్గ నాయకుడు అంటూ మరికొన్ని ప్లకార్డులలో రాశారు. అంతేకాదు.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర పేరు కూడా ప్లకార్డులపై ముద్రించి ఉంది. ఇక.. చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్దయెత్తున ఆందోళనలో పాల్గొంటున్నారు టీడీపీ శ్రేణులు, ప్రజలు. మరోవైపు.. స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటూ చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. అటు.. చంద్రబాబు కేసులకు సంబంధించి ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసు విచారణ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..