
వైపీపీ నుంచి సస్పెండైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లోని నివాసం నుంచి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వెళ్లకుండా ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. జలదీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో కోటంరెడ్డి తన ఇంటి వద్దే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.కాగా.. పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 8 గంటల పాటు జలదీక్షకు పిలుపునిచ్చారు.
జలదీక్ష నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు గురువారం ఉదయం ఆయన సిద్ధమవడంతో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీక్షకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు.. కాదని ముందుకెళ్తే కేసులు తప్పవంటూ కోటంరెడ్డికి వివరించారు. దీంతో పోలీసుల చర్యకు నిరసనగా కోటంరెడ్డి ఇంటిదగ్గరే బైఠాయించి.. నిరసన తెలుపుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న కోటంరెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకుని.. మద్దతుగా నిరసన తెలుపుతున్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోటంరెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..