AP Elections 2024 Counting: ఏపీలో విజయం దిశగా కూటమి.. జిల్లాల వారీగా ముందంజలో ఉన్న అభ్యర్థులు..

|

Jun 04, 2024 | 1:32 PM

ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఎన్డీయే కూటమి ప్రభంజనంలో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఏపీలో మంత్రులతో పాటు ముఖ్యనేతలు ఓటమికి చేరువలో ఉన్నారు. రాజకీయ ఉద్దండులు, హేమా హేమీలు, సీనియర్ అనుభవం ఉన్న నాయకులతో సహా మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్‌నాథ్‌, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తదితరులు ఉన్నారు.

AP Elections 2024 Counting: ఏపీలో విజయం దిశగా కూటమి.. జిల్లాల వారీగా ముందంజలో ఉన్న అభ్యర్థులు..
Ap Election Nda Alliance
Follow us on

ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఎన్డీయే కూటమి ప్రభంజనంలో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఏపీలో మంత్రులతో పాటు ముఖ్యనేతలు ఓటమికి చేరువలో ఉన్నారు. రాజకీయ ఉద్దండులు, హేమా హేమీలు, సీనియర్ అనుభవం ఉన్న నాయకులతో సహా మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్‌నాథ్‌, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్‌, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విడదల రజనీ, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఉష శ్రీచరణ్‌ తదితరులు తొలి రౌండు నుంచే వెనుకంజలో కొనసాగుతున్నారు. సీఎం జగన్‌ సొంత జిల్లాలోనూ కూటమి గట్టిపోటీని ఇచ్చింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల వారీగా ఎన్ని స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోందో ఇప్పుడు ఆ గణాంకాలు పరిశీలిద్దాం.

జిల్లాల వారీగా ఆధిక్యం ఇలా..

  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 12 సీట్లలో టీడీపీ ఆధిక్యం.
  • చిత్తూరులో 14కు 12 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజ.
  • తూర్పుగోదావరిలో 19కి 19 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థలు దూసుకెళ్తున్నారు.
  • పశ్చిమగోదావరి జిల్లాలో 15కి 14 చోట్ల కూటమి నేతలు లీడ్‌లోఉన్నారు.
  • గుంటూరులో 17కి 16 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఆధిక్యం.
  • కడప 10 అసెంబ్లీ స్థానాలకుగానూ 6 చోట్ల టీడీపీ లీడ్‌లో కొనసాగుతోంది.
  • కృష్ణా జిల్లాలో 16కి 15 స్థానాల్లో కూటమి దూకుడు ప్రదర్శిస్తోంది.
  • కర్నూలులో 14కి 11 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది తెలుగుదేశం.
  • నెల్లూరులో 10కి 8 చోట్ల ఆధిక్యం టీడీపీ అభ్యర్థులు ఉన్నారు.
  • ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 10 స్థానాల్లో కూటమి అభ్యర్థలు ముందున్నారు.
  • శ్రీకాకుళంలో 10కి 9 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ముందుకు దూసుకెళ్తోంది.
  • విశాఖపట్నంలో 15కి 13 ఎమ్మెల్యే అభ్యర్ధులు విజయానికి దగ్గరగా ఉన్నారు.
  • విజయనగరంలో 9కి 8 సీట్లు కూటమి కైవసం చేసుకునేలా కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని ఏపీ లైవ్ అప్డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..