Andhra Pradesh: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమ్మాయిలతో పాటు వివాహితులతోనూ ఆన్‌లైన్ ద్వారా పరిచయాలు పెంచుకుంటూ వారిని ట్రాప్ లోకి దింపుతున్నారు. సైబర్ నేరాల్లో ఎక్కువగా మహిళలు హనీ ట్రాప్ ద్వారా అమ్మాయిలతో అబ్బాయిలు మాట్లాడటం, అబ్బాయిలతో అమ్మాయిలని మాట్లాడిస్తూ వారిని తమ ట్రాప్ లో పడేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మొదటగా చాటింగ్ చేస్తూ.. కొద్ది రోజుల తరువాత ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. అందమైన అబ్బాయిలు, అమ్మాయిల ఫోటోలతో ఆకర్షించే విధంగా స్టేటస్‌లు పెడుతూ మభ్యపెడతారు. మంచి స్నేహితుల మాదిరిగా మాయమాటలు చెబుతూనే వారితో వీడియో కాల్ మాట్లాడే వరకు తీసుకువస్తారు. వారితో మాట్లాడే సమయంలో సైబర్ నేరగాళ్లు వాళ్ళ ఫోటోలను తీస్తారు. న్యూడ్ ఫోటోలు తీసి, వీరు చాట్ చేసిన మెసేజ్‌లు, ఫోటోలను వారి వాట్సాప్‌కే పంపిస్తారు. ఆ తరువాత వారి నిజ స్వరూపాన్ని ప్రదర్శిస్తారు. వారు అడిగినంత డబ్బు చెల్లించాలని బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బు చెల్లించక పోతే న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారు. దాంతో చేసేది ఏమి లేక, సమాజంలో పరువు పోతుందని భయంతో కోరినంత డబ్బు సమర్పించుకుంటారు.
ఇలాంటి ఘటనే నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వెలుగు చూసింది. విదేశాలకు వెళ్ళాలనుకున్న యువతి నుండి రూ. 14 లక్షలు, బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ మహిళల నుండి రూ. 26 లక్షలు కాజేశారు నైజీరియన్ సైబర్ నేరగాళ్లు. వివాహితలనే కాకుండా.. దేవుని భక్తులను సైతం వదలడం లేదు కేటుగాళ్లు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో స్టేటస్ లో పెట్టుకున్న వీడియోలను ఫోటోల ఆధారంగా దైవభక్తిని ప్రదర్శిస్తూ.. తాము కూడా మీ వర్గానికి చెందిన వారమే అంటూ మాట కలుపుతారు. కొంతకాలం స్నేహంగా ఉండి నమ్మిస్తారు. ఆ తరువాత మరో సైబర్ నేరగాడు వీరికి ఫోన్ చేసి.. మీ స్నేహితుడు మీ కోసం బంగారు బిస్కెట్లు, విదేశీ కరెన్సీ పంపించాడని, వీటి విలువ రూ. 50 లక్షలు ఉంటుందని నమ్మిస్తారు. గిఫ్ట్ బాక్స్ లో ఉన్న వాటి ఫోటోలను వాట్సాప్ ల ద్వారా పంపించి, వారు నమ్మేలా చేస్తారు. అయితే, అవి మీకు చేరాలంటే విమానాశ్రయంలో చిన్న సమస్య వచ్చిందని, ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లు పట్టుకోవడం జరిగిందటూ కథలు అల్లుతారు. కొంత ట్యాక్స్ కడితే వదిలేస్తారని చెబుతారు. ఇందుకోసం తమకు కొంత డబ్బు పంపించాలని, వాటిని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వారికి కట్టేసి.. గిఫ్ట్స్‌ని మీకు పంపిస్తామని నమ్మిస్తారు. వారిని నమ్మి జనాలు.. వారు అడిగిన మేరకు డబ్బును పంపిస్తారు.
మరి కొద్ది సేపటికి ఫోన్ చేసి గిఫ్ట్ లతో పాటు మీ స్నేహితున్ని కూడా అరెస్ట్ చేశారని, మరికొంత నగదును చెల్లిస్తే గిఫ్ట్ లతో పాటు వదిలేస్తారని చెప్తారు. రూ. 50 లక్షల విలువగల వస్తువులు వస్తాయని అశపడి నగదును చెల్లించిన తరువాత వారి నుండి ఎలాంటి సమాచారం ఉండదు. అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తరు మోసపోయామని గ్రహించి వెంటనే పోలీసులకు 100 ద్వారా తెలియజేస్తే సాంకేతిక పరిజ్ఞానం తో వారిని పట్టుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెప్తున్నారు అలాగ కాకుండా నగదు పోగొట్టుకున్న వారు సమాజంలో పరువు పోతుందని పోలీసులకు సమాచారం ఇవ్వకుండ ఇతర మార్గాలు ఎంచుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్ల ను పట్టుకోవడం కష్టంగా మారుతుందని ఎందుకటే వారి పై సిమ్ కార్డ్ లు కాని ఆన్లైన్ కాల్స్ కు సంబందించి వారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీస్ అధికారులు తెలిపారు నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్ కు చెందిన లక్ష్మి దేవి కి దేవుని పేరు చెప్పి 26 లక్షల ఆన్లైన్ ద్వారా సైబర్ నేరగాడు కాల్ చేయడంతో మోసపోయిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే సాంకేతిక పరిజ్ఞానంతో మోసం చేసిన సైబర్ నేరగాడు ఢిల్లీలో ఉన్నట్లు కనుగొన్నారు ఇతని కోసం ఢిల్లీ వెళ్ళిన పోలీసులు అతడు ఉన్న ప్రాంతంలో వారం రోజులుగా నిగా వేసి పట్టుకున్నారు నైజీరియన్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు ఈ మహిళ నుండి 26 లక్షలు తను తీసుకున్నప్పటికీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఇతరులపై ఉన్న సిమ్ కార్డులు ఆన్లైన్ నెట్ ను వాడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం ఇప్పటికైనా ప్రజలు విదేశీ లింకు ఫోన్లను, కానీ వాటిని ఓపెన్ చేయకుండా బ్లాక్ చేయడం ఉత్తమమని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా డోన్ డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..