Elections 2024: ఓ రైలు.. 5వేల మంది ఓటర్లు.. నాందేడ్ టు విశాఖ.. క్షణ క్షణం ఉత్కంఠ.. అసలు కథ ఏంటంటే..

|

May 13, 2024 | 1:51 PM

రైలు ఆలస్యం కారణంగా ఓటు వేయలేమన్న ఆందోళనలో ఉన్నారు ఓటర్లు. నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రయాణీకులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నామని చెబుతున్నారు. అయితే నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మే 12వ తేది రాత్రి 9.30 కు రావాల్సి ఉంది. అయితే 5-6 గంటలు ఆలస్యంగా రావడంతో 13 తేది తెల్లవారిజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో చేరుకుంది.

Elections 2024: ఓ రైలు.. 5వేల మంది ఓటర్లు.. నాందేడ్ టు విశాఖ.. క్షణ క్షణం ఉత్కంఠ.. అసలు కథ ఏంటంటే..
Train Delay
Follow us on

రైలు ఆలస్యం కారణంగా ఓటు వేయలేమన్న ఆందోళనలో ఉన్నారు ఓటర్లు. నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రయాణీకులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నామని చెబుతున్నారు. అయితే నాందేడ్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మే 12వ తేది రాత్రి 9.30 కు రావాల్సి ఉంది. అయితే 5-6 గంటలు ఆలస్యంగా రావడంతో 13 తేది తెల్లవారిజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో చేరుకుంది. దీంతో మధ్యాహ్నం 3 లేదా 4 గంటలకు తమ తమ నియోజకవర్గాలకు చేరుకుని ఓటు హక్కు వేసే అవకాశం ఉంటుందని భావించారు. అయితే ప్రస్తుతం ఈ ఆలస్యం కాస్త 9 గంటలకు చేరుకుంది. ఇందులో ఎక్కువగా తాడేపల్లి, రాజమండ్రి, విశాఖపట్నం వరకు వెళ్లే ప్రయాణికులు ఉన్నారు. కేవలం రైలు ఆలస్యం కారణంగానే తమ ఓటు హక్కును ఎక్కడ వినియోగించుకోలేక పోతామో అన్న నిరుత్సాహాన్ని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రైలు విశాఖపట్నం చేరుకోవడానికి సాయంత్రం 6 గంటలు అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటి నుంచి రైలు సరైన వేగంతో వెళితేకూడా సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి విశాఖపట్నం చేరుకుంటుంది. మామూలుగా అయితే ఈ నాందేడ్ నుంచి విశాఖ వెళ్లాల్సిన ఎక్స్ ప్రెస్ 13 వతేది ఉదయం 9 గంటలకు విశాఖపట్నం చేరుకోవాలి. మధ్యాహ్నం 2 గంటలు అయినప్పటికీ రాజమండ్రి కూడా చేరుకోలేదు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం చేరుకోవాలంటే కూడా 3 నుంచి 4 గంటలు పడుతుంది. దీంతో 5 ఏళ్లకు ఒకసారి వచ్చే తమ ఓటు హక్కును కోల్పోతామన్న నిరుత్సాహంలో ఉన్నారు. ఈ సమస్యపై రైల్వే అధికారులకు, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని, ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని చింతిస్తున్నారు. ఈ ట్రైనులో దాదాపు 5 వేల మందికి పైగా ప్రయాణీకులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు. తమ ప్రమేయం లేకుండా జరిగిన ఈ అసౌకర్యాకిని న్యాయం చేయాలని కోరుతున్నారు. పోలింగ్ సమయాన్ని పొడగించడం లేదా ఇంత దూరం కేవలం ఓటు కోసం ప్రయాణం చేసి వచ్చినందుకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లను చేయాలని ఎన్నికల అధికారులను కోరుతున్నారు. మరి దీనిపై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

 

ఇవి కూడా చదవండి

ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..