నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. సొమ్మసిల్లి వాహనం పడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. కుప్పం సమీపాన ఉన్న లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర స్టార్టయ్యింది. అనంతరం కొద్దిదూరం నడిచిన తర్వాత మసీదులో లోకేశ్ ప్రార్థనలు చేశారు. ఈ సమయంలో లోకేశ్ పక్కనే ఉన్నారు తారకరత్న. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానుల పెద్ద ఎత్తున రావడంతో… తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వెంటనే వాలంటీర్లు, టీడీపీ కార్యకర్తలు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా విషయం తెలిసిన వెంటనే నందమూరి బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే కేసీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం.. మెరుగైన వైద్యం కోసం తారకరత్నను పీసీఎస్ ఆస్పత్రికి తరలించారు.
గురువారం హిందూపురం పర్యటనలోనూ బాలకృష్ణ వెంట ఉన్నారు తారకరత్న. టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. బాలకృష్ణతోపాటు ఉల్లాసంగా గడిపారు తారకరత్న. ఆ తర్వాత లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వచ్చారు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..