AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందా.. చెన్నకేశవుడి పాదాల నుంచి రక్తం..! వీడియో చూడండి..

కలియుగ అంతంపై పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పుడు నిజమవుతున్నాయా? లోకంలో పాపాలు పెరిగిపోయినప్పుడు దేవుడే ప్రత్యక్షంగా హెచ్చరికలు పంపుతాడా? అంటే అవుననే అంటున్నారు తిరుపతి జిల్లా నాగవరం గ్రామస్తులు. అక్కడ వెలసిన పురాతన ఆలయంలో స్వామివారి పాదాల నుంచి ఎర్రటి ద్రవం బయటకు వస్తుండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ ఆలయంలో ఏం జరుగుతోంది? తెలుసుకుందాం..

Video: బ్రహ్మంగారు చెప్పిందే నిజమవుతుందా.. చెన్నకేశవుడి పాదాల నుంచి రక్తం..! వీడియో చూడండి..
Mystery In Tirupati Chennakesava Swamy Temple
Sudhir Chappidi
| Edited By: |

Updated on: May 28, 2026 | 4:54 PM

Share

తిరుపతి జిల్లా చిట్వేలు మండలంలోని నాగవరం గ్రామంలో వెలసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఒక అంతుచిక్కని వింత సంఘటన చోటుచేసుకుంది. ఆలయ గర్భగుడిలోని స్వామి వారి పాదాల పీఠం భాగం నుండి ఎర్రటి వర్ణంతో కూడిన ఒక ద్రవం నిరంతరం బయటకు వస్తోంది. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా శిలా విగ్రహాల నుండి ఇలాంటి ద్రవాలు రావడం అత్యంత అరుదు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం.. కలియుగం అంతమయ్యే ముందు దైవ విగ్రహాలు కన్నీరు పెడతాయని, రక్తం కారుస్తాయని చెప్పిన కొన్ని ఆనవాళ్లు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయని స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

1228 నాటి పురాతన ఆలయం..

ఈ చెన్నకేశవ స్వామి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఈ దేవాలయం క్రీస్తుశకం 1228 సంవత్సరంలో నిర్మితమైనట్లు ఆధారాలు ఉన్నాయి. అంటే దాదాపు 800 ఏళ్ల నాటి పురాతన ఆలయం ఇది. ఒకప్పుడు అంగరంగ వైభవంగా, ధూపదీప నైవేద్యాలతో, నిత్య కల్యాణాలతో విరాజిల్లిన ఈ ఆలయం, కాలక్రమేణా ఆధరణకు నోచుకోక పూజా పునస్కారాలు తగ్గిపోయాయి. కలియుగ వైకుంఠ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, నాగవరం చెన్నకేశవ స్వామి ఇద్దరూ అన్నదమ్ములని స్థానికుల నమ్మకం. అన్న అయిన వేంకటేశ్వరుడికి తిరుమలలో నిత్యం కోట్లాది రూపాయలతో ఘనంగా పూజలు జరుగుతుంటే.. ఇక్కడ తమ్ముడైన చెన్నకేశవ స్వామికి మాత్రం కనీస ధూపదీప నైవేద్యాలు కూడా సరిగా జరగడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని, పూజలను నిర్లక్ష్యం చేయడం వల్లే స్వామి ఆగ్రహించి, ఇలా తన పాదాల నుండి ఎర్రటి ద్రవాన్ని కారుస్తూ హెచ్చరిస్తున్నాడని భక్తులు నమ్ముతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..

ఈ వింత పరిణామంపై ఎండోమెంట్ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే గ్రామానికి, రాష్ట్రానికి పెద్ద అరిష్టం దాపురిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి గానీ, సంబంధిత ఉన్నతాధికారులు గానీ వెంటనే నాగవరం చెన్నకేశవ స్వామి ఆలయాన్ని సందర్శించాలి. అక్కడ జరుగుతున్న వింతపై విచారణ జరపడంతో పాటు స్వామివారి ఆగ్రహాన్ని చల్లార్చడానికి తక్షణమే ఆలయంలో శాంతి హోమాలు, ప్రత్యేక ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించాలని గ్రామస్తులు, భక్తులు గట్టిగా విన్నవించుకుంటున్నారు.

వీడియో చూడండి..

Follow Us