400 ఏళ్ళుగా తేరా తేజి పండుగ.. ఉభయ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన జనం.. ప్రతియేటా కంభం చెరువు వద్ద..

| Edited By: శివలీల గోపి తుల్వా

Aug 30, 2023 | 7:11 PM

Prakasham District News: దైవ దర్శనం చేసుకుని వెళ్లిన వారు వివాహం అయిన తర్వాత మళ్లీ వారి మొక్కులను చెల్లించుకునేందుకు వారి వివాహ వేడుకలలో మార్చుకున్న పూల మాలలను (బాసికాలు) తీసుకువచ్చి కంభం చెరువులో గంగమ్మకు అర్పిస్తారు. దీంతో వారి మొక్కు తీర్చుకున్నట్లుగా ప్రజలు భావిస్తారు. బుధవారం జరిగిన ఈ గరిక తొక్కుడు పండగకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఏటా మొహర్రం తరువాత వచ్చె నెలలో తేరాతేజి పండుగ జరుపుకోవడం అనవాయితీగా..

400 ఏళ్ళుగా తేరా తేజి పండుగ.. ఉభయ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన జనం.. ప్రతియేటా కంభం చెరువు వద్ద..
Tera Tezi Festival
Follow us on

ప్రకాశం జిల్లా, ఆగస్టు 30: ప్రకాశం జిల్లా కంభం చెరువు కట్టపై తేరాతేజి (గరిక తొక్కుడు) పండగ ఘనంగా జరిగింది. దశాబ్దాల కాలంగా తేరాతేజి పండుగ ఈ ప్రాంతంలో ఘనంగా జరుగుతుంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద చెరువులలో రెండవదైన కంభం చెరువు దగ్గర జరిగే గరిక తొక్కుడు పండుగకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. ప్రతి ఏటా ఈ పండగకు రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు భారీగా తరలి వస్తారు. ముఖ్యంగా ఇక్కడ వివాహం కానీ యువతలను తీసుకువచ్చి చెరువు కట్టపై ఉన్న గరికను తొక్కించి కంభం చెరువులో నీళ్లను తాకిస్తారు. అలాగే చెరువు పక్కనే ఉన్న హజరత్ దీనావలి షా దర్గాలో ప్రార్థనలు నిర్వహిస్తే త్వరగా వివాహం అవుతుందని ప్రగాఢంగా ప్రజలు నమ్ముతారు.

అంతే కాకుండా ఇక్కడకు వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్లిన వారు వివాహం అయిన తర్వాత మళ్లీ వారి మొక్కులను చెల్లించుకునేందుకు వారి వివాహ వేడుకలలో మార్చుకున్న పూల మాలలను (బాసికాలు) తీసుకువచ్చి కంభం చెరువులో గంగమ్మకు అర్పిస్తారు. దీంతో వారి మొక్కు తీర్చుకున్నట్లుగా ప్రజలు భావిస్తారు. బుధవారం జరిగిన ఈ గరిక తొక్కుడు పండగకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఏటా మొహర్రం తరువాత వచ్చె నెలలో తేరాతేజి పండుగ జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. ముస్లింలు ఈ ఎడాది పెళ్లయిన నూతన వదువరులు ఒకరికి ఒకరు అభిముఖంగా నిలబడి వివాహ సమయంలో వాడిన బాసికాలు (పూలదండలు) కంభం చెరువులోని నీటిలో వదలడం అనవాయితీగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇలా చేయడం వలన ఆ దంపతులు సుఖసంతోషాలతో ఉంటారని వారి నమ్మకం. వారితో పాటు కుటుంబ పెద్దలు, పిల్లలు సైతం వచ్చి చెరువు కట్టపై ఉన్న దీనాషావలి దర్గా దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. తద్వారా వారికి సర్వరోగాలు నయమైతాయని, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం.  400 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. అయితే తమకు తెలిసినంత వరకు చెరువు నిర్మించినప్పటి నుంచి కొనసాగుతోందని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. ప్రస్తుతం కంభం చెరువు జలకళతో ఉండటంతో ఇక్కడకు వచ్చిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కంభం ప్రాంత ప్రజలేగాక గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కడప, పోరుమామిళ్ల, గుంటూరు తదితర ప్రాంతాలతో పాటు వీరి బందువులు వచ్చారు. ఇతర రాష్ట్రాలలో ఉన్న నూతన దంపతులు వచ్చి తేరాతేజి పండుగలో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు.