AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Panchayat Polls: సుప్రీం కోర్టు తీర్పు అధ్యయనం తర్వాతనే పంచాయతీ ఎన్నికలపై స్పందిస్తాం.. విజయసాయి రెడ్డి

ఏపీ పంచాయతీ ఎన్నికలను నిర్వహణ పై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..

AP Panchayat Polls: సుప్రీం కోర్టు తీర్పు అధ్యయనం తర్వాతనే పంచాయతీ ఎన్నికలపై స్పందిస్తాం.. విజయసాయి రెడ్డి
Surya Kala
|

Updated on: Jan 25, 2021 | 6:10 PM

Share

AP Panchayat Polls:  ఏపీ పంచాయతీ ఎన్నికలను నిర్వహణ పై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. సుప్రీంకోర్టు ఎలాంటి అంశాలు పొందుపరిచి తీర్పు ఇచ్చిందో .. అన్నీ అధ్యయనం చేస్తామని చెప్పారు. అనంతరం తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.

ఏపీలో ఎన్నికలు నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదని హైకోర్టుకు, సుప్రీం కోర్టు ప్రభుత్వం విన్నవించిందని అసలు ఇప్పుడు ఎన్నికలను వాయిదా వేయమని అడుగుతున్నామో కోర్టులకు తెలిపామని విజయసాయి రెడ్డి చెప్పారు. ఇక సుప్రీం తీర్పుపై అందరితో చర్చించాకే… మాట్లాడతామని ఆయన తెలిపారు. కొద్దిగా సమయం ఇస్తే ఎన్నికల విషయంపై రియాక్ట్ అవుతామని చెప్పారు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా… ప్రస్తుతానికి తన సమాధానం ఇదేనని అన్నారు విజయసాయి రెడ్డి.

Also Read: క్లైమాక్స్ అటూ ఇటూ అయితే ఫ్యాన్స్ బస్సులు, లారీలు వేసుకుని వచ్చేస్తారంటున్న డాక్టర్ బాబు