AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Avinash Reddy: ఆందోళకరంగానే అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్యం.. ICUలోనే కొనసాగుతున్న వైద్యం..

అవినాష్ అరెస్ట్ విషయం ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది.. కర్నూలులో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. అటు… ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం ఇంకా ఆందోళకరంగానే ఉంది. మరికొన్ని రోజులు ICUలోనే ఉంచి పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి డాక్టర్లు .అవినాష్‌రెడ్డికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఆస్పత్రి ముందు ప్రధాన రహదారిపై బైఠాయించారు

MP Avinash Reddy: ఆందోళకరంగానే అవినాష్‌రెడ్డి తల్లి ఆరోగ్యం.. ICUలోనే కొనసాగుతున్న వైద్యం..
Avinash Reddy
Sanjay Kasula
|

Updated on: May 24, 2023 | 7:03 PM

Share

ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం ఇంకా ఆందోళకరంగానే ఉంది. మరికొన్ని రోజులు ICUలోనే ఉంచి పర్యవేక్షించాల్సి ఉంటుందని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.. అటు అవినాష్‌రెడ్డికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఆస్పత్రి ముందు ప్రధాన రహదారిపై బైఠాయించారు. అవినాష్‌ను అదుపులోకి తీసుకునేందుకు CBI అధికారులు వస్తారన్న ప్రచారంలో టెన్షన్‌ సిట్యుయేషన్ కొనసాగుతోంది. మద్దుతుదారులు పెద్దఎత్తున ఆస్పత్రివద్దకు వస్తున్నారు. తాము CBIకి వ్యతిరేకం కాదని.. కానీ అధికారులు కూడా కాస్త మానవతా ధృక్పథంతో ఆలోచించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వంలో CBIని రాష్ట్రానికి రాకుండా నిషేధించారని.. కానీ తాము మాత్రం కొంత గడువు మాత్రమే కోరుతున్నామంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు…

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవినాష్‌ తల్లి లక్ష్మమ్మను పరామర్శించారు. YSR చెల్లెలు విమలారెడ్డి . వివేకా హత్య తర్వాత YS ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య కేసుతో అవినాష్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని మొదట తనతో చెప్పిన సునీతారెడ్డి.. ఇప్పుడు మాట మార్చారని అన్నారు. ఆమె వెనుక దుష్టశక్తులు పనిచేస్తున్నాయని చెప్పారు విమలారెడ్డి.

మరోవైపు అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా… సీబీఐ నోటీసులు ఇవ్వడం లాంటి చర్యలకు దిగడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిలుపై నిర్ణయం తీసుకోవడానికి ఇన్ని రోజులా అని తెలంగాణ హైకోర్టుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తంచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఉత్తర్వులు జారీ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసింది. అవినాశ్‌ పిటిషన్‌పై ఈ నెల 25న హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపి తగిన ఆదేశాలివ్వాలని ఆదేశించింది. గతంలో మరో బెంచ్‌ విచారించినప్పటికీ వెకేషన్‌ బెంచ్‌ విచారణకు అడ్డంకి కాదని తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే