Chittoor: ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి ఊరంతా ఖాళీ.. గడపగడపకు కార్యక్రమాన్ని మూకుమ్మడిగా బహిష్కరించిన వైనం

ఆ ఊరు జనం ఎమ్మెల్యేకి గట్టి షాక్‌ ఇచ్చారు. అట్లా ఇట్లా కాదు.. అదో వెరైటీగా ఇచ్చారు. అందులోనూ నిరసన అంటే ధర్నాలు, రాస్తారోకోలో, నిలదీయడాలో వంటివి చేస్తారు. కానీ.. ఆ ఊరు జనం మాత్రం.. ఎమ్మెల్యే వస్తున్నాడన్న సమాచారం తెలుసుకొని.. ఊరునే వదిలి వెళ్లారు. ఉండి సమస్యలు చెప్పినా వేస్ట్‌ అనుకున్నారో.. చెప్పినా పరిష్కరించలేరని అనుకున్నారో ఏమో కాని.. ఊరు వదిలి వెళ్లి పోయారు.

Chittoor: ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి ఊరంతా ఖాళీ.. గడపగడపకు కార్యక్రమాన్ని మూకుమ్మడిగా బహిష్కరించిన వైనం
Mla MS Babu
Follow us
Basha Shek

|

Updated on: May 24, 2023 | 5:39 PM

ఆ ఊరు జనం ఎమ్మెల్యేకి గట్టి షాక్‌ ఇచ్చారు. అట్లా ఇట్లా కాదు.. అదో వెరైటీగా ఇచ్చారు. అందులోనూ నిరసన అంటే ధర్నాలు, రాస్తారోకోలో, నిలదీయడాలో వంటివి చేస్తారు. కానీ.. ఆ ఊరు జనం మాత్రం.. ఎమ్మెల్యే వస్తున్నాడన్న సమాచారం తెలుసుకొని.. ఊరునే వదిలి వెళ్లారు. ఉండి సమస్యలు చెప్పినా వేస్ట్‌ అనుకున్నారో.. చెప్పినా పరిష్కరించలేరని అనుకున్నారో ఏమో కాని.. ఊరు వదిలి వెళ్లి పోయారు. ఎమ్మెల్యే ఊర్లో ఉన్నంత సేపు ఇంటికి రాలేదు. ఈ వింత ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పూతలపట్టు మండలం పేట అగ్రహారం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యేకు ఈ చేదు అనుభవం ఎదురయింది. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో గ్రామంలో పర్యటించారు ఎమ్మెల్యే ఎమ్మెస్‌ బాబు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఎమ్మెల్యే టూర్‌ను బహిష్కరించారు. ఇళ్లకు తాళాలు వేసి గ్రామం విడిచి వెళ్లిపోయారు గ్రామస్థులు. పేట అగ్రహారం పంచాయతీలోని అంబేద్కర్ కాలనీ వాసులు మినహా గ్రామమంతా ఖాళీ చేసి వెళ్లి పోయారు. గ్రామస్తులు ఇలా నిరసన తెలిపి ఇళ్లకు తాళాలు వేసినా.. ఎమ్మెల్యే మాత్రం ఎస్సీ కాలనీలో పర్యటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో లబ్ధి పొంది బహిష్కరించడాన్ని తప్పు పట్టారు ఎమ్మెల్యే. గడపగడపకు వస్తే తాళం వేసి వెళ్ళిన వారు లబ్ధి ఎలా పొందుతారని ప్రశ్నించారు ఎమ్మెల్యే. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు తీసుకుని.. తాము ఇళ్ళ వద్దకు వస్తే తాళం వేసుకుంటారా? అని అక్కసు వెళ్ల గక్కారు ఎమ్మెల్యే. ఇంతటితో ఆగని ఎమ్మెల్యే తన మాటలతో ఒంటి కాలిపై లేశారు. ఇక నుంచి తనను అవమానించిన వారికి వంద శాతం పథకాలు రావని వార్నింగ్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు తీసుకున్న స్కీమ్‌లను రిటన్‌ ఇవ్వాలంటూ బెదిరించారు.

‘అభివృద్ధి కోసం వస్తే అవమానించారు. ఇకపై మీకు 100 శాతం పథకాలు ఇవ్వం. మీరు తీసుకున్న పథకాలు వాపసు ఇవ్వాలి’ అని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. అయితే.. జనం తమ నిరసన వ్యక్తం చేసినా.. ఎమ్మెల్యే చేసిన కామెంట్స్‌ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒక్క ఎమ్మెల్యే అయి ఉండి.. జనంపై ఇలా వ్యాఖ్యలు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు.. ఎమ్మెల్యే ఏమైనా సొంత ఇంటి నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారా అని మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..