AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Viveka Case: వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొన్న సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కౌంటరులో సీబీఐ అధికారులు పలు కీలక అంశాలు ప్రస్తావించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎనిమిదో నిందితుడు (A8)గా పేర్కొన్నారు.

YS Viveka Case: వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొన్న సీబీఐ
YS Avinash Reddy
Ram Naramaneni
|

Updated on: Jun 08, 2023 | 4:51 PM

Share

వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని ఈనెల 5న కౌంటర్‌ దాఖలు చేసింది సీబీఐ. అందులో పలు కీలక అంశాలు ప్రస్తావించింది సీబీఐ. వైఎస్ అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొంది. ఇంతకుముందు దాఖలు చేసిన కౌంటర్‌లో అవినాష్‌రెడ్డిని సహనిందితుడిగా పేర్కొన్నారు తప్ప ఎక్కడా కూడా నిందితుడిగా చెప్పలేదు. తాజాగా  కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని వెల్లడించింది. కేసును పక్కదారి పట్టించే విధంగా, సాక్షులను ప్రభావితం చేసేందుకు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి అడుగడుగునా ప్రయత్నిస్తున్నారని సీబీఐ స్పష్టం చేసింది. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసం వెనక కుట్రపై దర్యాప్తు సాగుతోందని తెలిపింది. శివశంకర్ రెడ్డి ఫోన్ చేసిన నిమిషంలోపే అవినాష్ హత్యాస్థలికి వెళ్లారని పేర్కొంది.

ఇక వివేకా హత్య జరిగిన రోజు ఉదయం 5:20 గంటలకు ముందే అవినాష్ రెడ్డి, శివశంకర్‌రెడ్డిలతో గంగిరెడ్డి మాట్లాడినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు సీబీఐ కౌంటర్‌లో వెల్లడించింది. కేసు పెట్టొద్దని, పోస్టుమార్టం వద్దని సీఐ శంకరయ్యకు అవినాష్, శివశంకర్ రెడ్డి చెప్పారని అందులో పేర్కొంది. సీబీఐకి, కోర్టుకు ఏమీ చెప్పొద్దని దస్తగిరిని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని వివరించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Follow Us
అందుకే శ్రీహరిని చివరి చూపు చూడలేకపోయాను..
అందుకే శ్రీహరిని చివరి చూపు చూడలేకపోయాను..
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం