AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake challan scam: రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి అనకోండలు.. విశాఖ లంకెల పాలెంలో బడా దందా..

ఏపీలో నకిలీచలాన్ల గుట్టు వీడుతోంది.. తవ్వేకొద్దీ అవినీతి బాగోతమంతా బయటకొస్తోంది. చీమలపుట్టలో పాము దూరినట్లు.. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి అనకోండల...

Fake challan scam: రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి అనకోండలు.. విశాఖ లంకెల పాలెంలో బడా దందా..
Fake Challan Scam
Sanjay Kasula
|

Updated on: Aug 27, 2021 | 10:20 AM

Share

ఏపీలో నకిలీచలాన్ల గుట్టు వీడుతోంది.. తవ్వేకొద్దీ అవినీతి బాగోతమంతా బయటకొస్తోంది. చీమలపుట్టలో పాము దూరినట్లు.. రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి అనకోండల ఆగడాలు ఒక్కోటిగా… ఒక్కో కోటిగా బయటికొస్తున్నాయి. విశాఖ లంకెల పాలెం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మరిన్ని నకిలీ చలాన్లు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు కోటీ పదిలక్షల రూపాయలుగా ఉంటుందని తేల్చారు ఏసీబీ అధికారులు. తొలి రోజు 15.5 లక్షల విలువైన నకిలీ చలాన్లు బయటపడ్డాయి. ఆ తరువాతి రోజు ఈ బాగోతం 90లక్షల రూపాయలకు చేరితో.. ఇప్పుడు ఏకంగా కోటీ10 లక్షలకు చేరింది.

2020 మార్చి నుంచి 2021 ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్ల చలానాలు తనిఖీ చేశారు అధికారులు. ఈ-స్లాం కు ఆఫీసర్‌గా అప్పట్లో పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ నర్సింహమూర్తి కారణమని అధికారులు తేల్చారు. నర్సింహమూర్తిని అధికారులు సస్పెండ్ చేశారు.

ప్రస్తుతం ఆయన కోటవురట్ల సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నారు. అయితే.. లంకెలపాలెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చలానా మార్ఫింగ్ కేసులో మోసానికి పాల్పడ్డ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు వెంకటరమణను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి

Havana Syndrome‌: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..