AP News: హోం మంత్రి అనితను కలిసిన ముంబై నటి జత్వానీ

అక్రమ కేసుల నుంచి తనకు విముక్తి కలిగించాలని ఏపీ హోంమంత్రి అనితను కోరారు ముంబై నటి జత్వాని. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలన్నారు జత్వాని.

AP News:  హోం మంత్రి అనితను కలిసిన ముంబై నటి జత్వానీ
Jatwani - Minister Anitha
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 19, 2024 | 7:42 PM

ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెక్రటేరియట్‌లో ఏపీ హోమంత్రి అనితను కలిశారు జత్వాని. తనకు జరిగిన అన్యాయంపై అరగంట పాటు గోడు వెళ్లబోసుకున్నారు. సీనియర్ సిటిజన్స్ అయిన తన తల్లి, తండ్రి పట్ల విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరును అనితకు వివరించారు. తన ఫోన్‌ను ఓపెన్ చేసేందుకు యత్నించారన్నారు. తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.

ప్రస్తుత ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని. తనపై తప్పుడు కేసులు పెట్టిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిందన్నారు జత్వాని. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని హోమంత్రిని కోరామన్నారు. తనకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.

జత్వానీ వ్యవహారం వెనుక ఉన్న పెద్దలెవరో బయటకు వచ్చిందన్నారు ఆమె లాయర్ నర్రా శ్రీనివాసరావు. ముంబైలో ఉన్న కేసును క్లోజ్ చేయించడం కోసమే జత్వానీపై ఏపీలో కేసు పెట్టారన్నారు. ఇక్కడ జత్వానీపై ఉన్న కేసు క్లోజ్ అయితే.. ముంబై కేసు గురించి ఆ రాష్ట్రంలో పోరాడతామన్నారు. జత్వానీ మీద కేసును విత్ డ్రా చేసుకుంటే ఆమె మీద పడిన మచ్చ పోతుందన్నారు.

జత్వాని కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ , కేసు వివరాలుపై విజయవాడ సీపీని అడిగి వివరాలు తెలుసుకున్నారు హోంమంత్రి అనిత. జత్వాని కేసులో ఇన్వాల్వ్‌ అయిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..