Andhra Pradesh: బీజేపీ, జనసేన మధ్య కటీఫ్? సంచలనంగా మారిన మాధవ్ కామెంట్స్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే అని బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే అని బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అవును, బీజేపీ, జనసేన మధ్య చెడినట్టే కనిపిస్తోంది. పొత్తులున్నా తమతో కలిసి జనసేన పనిచేయకపోవడంపై బీజేపీ గుస్సా మీదున్నట్టు స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాయమడిగినా చేయలేదని జనసేనపై విమర్శలు సంధిస్తున్నారు బీజేపీ నేతలు. బీజేపీ పదాధికారుల సమావేశం తర్వాత ఆ పార్టీ నేత మాధవ్ చేసిన హాట్ కామెంట్స్.. ఇప్పుడు కాకరేపుతున్నాయ్.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ కోసం పవన్‌ని అడిగామనీ.. అయితే, జనసేన నుంచి ఎలాంటి స్పందనా రాలేదనీ చెప్పారు మాధవ్. పొత్తుల విషయంలో చాలా ఆలోచలున్నాయని చెప్పిన ఆయన.. బీజేపీ ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటోందనీ తెలిపారు. ఏపీ బీజేపీలో కీలకనేతగా ఉన్న మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంతేకాదు.. మాధవ్ వ్యాఖ్యలతో ఈ రెండు పార్టీలు బ్రేకప్ చెప్పేసుకుంటున్నాయనే చర్చ మొదలైందిప్పుడు.
మగళవారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష తర్వాత మాధవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ-జనసేన పార్టీల పొత్తులపై కీలక కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పనిచేయలేదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఉత్తరాంధ్రతో పోల్చితే రాయలసీమలోనే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పారాయన. అంతేకాదు.. ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక వైసీపీతో కలిసి బీజేపీ పనిచేస్తుందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోందన్న మాధవ్.. ఈ ప్రచారాన్ని ఖండించారు. అలాంటి పొత్తులేమీ లేవని తేల్చి చెప్పారు. ఉత్తరాంధ్రలో ఓటమిని పక్కనపెడితే మిగిలిన చోట్ల గతంలో కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లే వచ్చాయని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..