‘ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం’.. మరోసారి తేల్చేసిన కేంద్రం..

ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకే ఈ నిర్ణయం..

'ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం'.. మరోసారి తేల్చేసిన కేంద్రం..
Central Government
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 22, 2023 | 8:52 AM

ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఆర్థిక లోటు భర్తీకి 14వ ఆర్థిక సంఘం ఏపీకి నిధులు కేటాయించిందా? అని వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ప్రత్యేక హోదాకు బదులుగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. 2015 నుంచి 2018 వరకు ఏపీ పథకాలకు తీసుకున్న రుణాలపై వడ్డీని కూడా చెల్లించినట్టు తెలిపింది. దీని కోసం రూ.15.81 కోట్లు విడుదల చేశామని మంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు.