Andhra: పశువులను మేత కోసం అడవిలోనికి తోలుకెళ్లిన కాపర్లు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి..
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దంతెరపల్లె గ్రామానికి చెందిన దంపతులు సారమేకల శ్రీనివాసులు–శారదలు అప్పుల బాధతో ఐదు నెలల క్రితం అదృశ్యమయ్యారు. తాజాగా సంజీవరాయునిపేట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దంతెరపల్లె గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదు నెలల క్రితం అదృశ్యమైన దంపతుల మృతదేహాలు సంజీవరాయునిపేట నల్లమల అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. అప్పుల బాధతో ఆరు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్యాభర్తలు సారమేకల శ్రీనివాసులు అతని భార్య శారద కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుంచి వారి జాడ తెలియలేదు. సంజీవరాయుని పేట అటవీప్రాంతంలో కొంతమంది పశువుల కాపర్లకు ఓ రెండు మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ దాదాపు కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో వీరి ఆత్మహత్యల విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహాల ఆనవాళ్లు కూడా లేవు… పుర్రె, ఎముకలు, ధరించిన దుస్తులు మాత్రం మిగిలాయి.
ప్రకాశంజిల్లా గిద్దలూరు మండలం దంతెరపల్లె గ్రామానికి చెందిన భార్యాభర్తలు సారమేకల శ్రీనివాసులు, శారదలు ఏ ఏడాది జులై 3వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలిపారు… అప్పటి నుంచి వీరి కోసం బంధువులు గాలించారు… పోలీసులకు ఫిర్యాదు చేసినా వీరి జాడ దొరకలేదు… ఆ తరువాత శారద, శ్రీనివాసులు ఐదు నెలల తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలో శవమైతెలారు… గ్రామంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో 15 లక్షలు అప్పులు తేలాయి… అప్పులు తీర్చలేమని మానసికంగా కృంగిపోయిన శ్రీనివాసులు అతని భార్య శారద ఇంటి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఆత్మహత్య చేసుకోవాలని సంజీవరాయునిపేట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతానికి చేరుకుని ఓ చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న రైతులు, పశువుల కాపర్లు విషయాన్ని గుర్తించి అటవీశాఖ అధికారులకు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Srinivasulu Sharada
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




