Minister Roja: కుప్పంలో వైసీపీకి ఆదరణ.. చంద్రబాబు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని మంత్రి రోజా సవాల్..

లోకేష్ ప్రచారం చేశాకే కుప్పం మునిసిపాలిటీ ఓడిపోయారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలు రాళ్ళు, కర్రలతో దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా సన్మానించమంటారా అంటూ టీడీపీ నేతలను ప్రశ్నించారు మంత్రి రోజా. 

Minister Roja: కుప్పంలో వైసీపీకి ఆదరణ.. చంద్రబాబు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని మంత్రి రోజా సవాల్..
Roja Lokesh
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:25 PM

Minister Roja on Lokesh: ఏపీలో ఎన్నికలకు ముందే రాజకీయాల హీట్ మొదలైంది. అధికార పార్టీ వైసీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అంటూ మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా నారా లోకేష్ సీఎం కామెంట్స్ కు మంత్రి రోజా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.  అసలు లోకేష్ మాటలు వింటుంటే మాయాబజార్ లో ఉత్తర కుమారుడు గుర్తుకొస్తున్నాడని అన్నారు.

లోకేష్..  జగన్ కాలి గోటికి కూడా సరిపోడని సంచనల వ్యాఖ్యలు చేశారు రోజా. వార్డు మెంబర్ గా కూడా గెలవని వ్యక్తి సీఎం జగన్ ను విమర్శిస్తున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ ప్రచారం చేశాకే కుప్పం మునిసిపాలిటీ ఓడిపోయారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలు రాళ్ళు, కర్రలతో దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా సన్మానించమంటారా అంటూ టీడీపీ నేతలను ప్రశ్నించారు మంత్రి రోజా.  జగన్ ఫ్యాక్షనిస్ట్ కాదు, దమ్మున్న మగాడిలా సీఎం అయిన వ్యక్తి.. అసలు 33 ఏళ్లుగా మీరు చేయని అభివృద్ధి జగన్ చేసి చూపారంటూ  ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు రోజా.

కుప్పం నడిరోడ్డుపై చంద్రబాబు ను కూర్చోబెట్టాడు. అధికారంలో ఉన్న 14 ఏళ్లు కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయకుండా చంద్రబాబు ఏం చేశారని మంత్రి ప్రతిపక్ష నేతలపై ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు 33 ఏళ్లలో కుప్పంలో ఎన్నిసార్లు పర్యటించారో .. అంతకంటే ఎక్కువగా గత మూడేళ్లలో పర్యటించారని.. దీనికి కారణం కుప్పం ప్రజలు వైసీపీ కి బ్రహ్మరథం పట్టడమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రోజా. అనుమానం ఉంటే రాజీనామా చేసి కుప్పంలో పోటీ చేయాలని మంత్రి ఆర్కే రోజా చంద్రబాబుకి సవాల్ విసిరారు. మరి మంత్రి రోజా సవాల్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడలి మరి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.