Minister Dadisetti Raja: పవన్‌పై నమ్మకం లేకనే జూ.ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ.. మంత్రి దాడిశెట్టి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు

|

Aug 23, 2022 | 4:06 PM

ఏపీ ప్రజలు పవన్ విముక్త రాష్ట్రాన్ని కోరుతున్నారని చెప్పారు. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు కలిశారో తెలుసా.. పవన్ కళ్యాణ్ పై నమ్మకం లేకే కలిశారని తెలిపారు. 

Minister Dadisetti Raja: పవన్‌పై నమ్మకం లేకనే జూ.ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ.. మంత్రి దాడిశెట్టి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు
Dadisetti Raja Pawan Kalya
Follow us on

Minister Dadisetti Raja On Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం.. ప్రజాప్రతినిధులు చేపట్టిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల స్పందన చాలా బావుందని మంత్రి దాడిశెట్టి రాజా  చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడం చేపట్టిన ఈ కార్యక్రమానికి  ప్రతి ఇంటి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందన్నారు. అంతేకాదు ప్రతిపక్షాలు సీఎం జగన్ పై రకరకాల విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ కు  నాదెండ్ల.. .నారా.. పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి వెన్నుపోటు ప్రయత్నం లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి దాడిశెట్టి రాజా. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఇంకో వంద మంది వచ్చినా సీఎం జగన్ ను ఏమి చెయ్యలేరని ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ కు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబు చెప్తే కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ ది.. అంటూ ఎద్దేవా చేశారు. అసలు ఏపీ ప్రజలు పవన్ విముక్త రాష్ట్రాన్ని కోరుతున్నారని చెప్పారు. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు కలిశారో తెలుసా.. పవన్ కళ్యాణ్ పై నమ్మకం లేకే కలిశారని తెలిపారు.

కాపులకు ఆరాధ్యమైన రంగ విషయంలో చంద్రబాబు కు సంబంధం లేదని పవన్ చెప్పిస్తారా అంటూ సవాల్ విసిరారు. ముద్రగడ అంశంలో కాపు లపై పెట్టిన కేస్ లను తీసి వేయించే ప్రయత్నం పవన్ చేశారా అని ప్రశ్నించారు. అసలు కాపులకు అన్యాయం చేసిన పవన్ కళ్యాణ్ వెంట  వెళ్ళడానికి కాపులు ఎవరూ రెడీ గా లేరంటూ జోస్యం చెప్పారు మంత్రి దాడిశెట్టి రాజా. మరి మంత్రి చేసిన వ్యాఖ్యలకు.. ఆరోపణలకు జనసేన అధినేత, పార్టీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి మరి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..