Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botsa Satyanarayana: టీడీపీకి నూకలు చెల్లిపోయాయి.. ఆ పార్టీకి భవిష్యత్ లేదు.. చంద్రబాబుపై మంత్రి ఫైర్..

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీలను ఉద్ధరించినట్టు చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని ఆరోపించారు. అప్పట్లో బాబు...

Botsa Satyanarayana: టీడీపీకి నూకలు చెల్లిపోయాయి.. ఆ పార్టీకి భవిష్యత్ లేదు.. చంద్రబాబుపై మంత్రి ఫైర్..
Botsa Satyanarayana
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 25, 2022 | 7:39 PM

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీలను ఉద్ధరించినట్టు చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని ఆరోపించారు. అప్పట్లో బాబు సిట్‌ అంటే సిట్, స్టాండ్‌ అంటే స్టాండ్‌ అని గుర్తు చేశారు. బలహీనవర్గాల అభ్యున్నతికి బాటలు వేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని చెప్పారు. టీడీపీకి నూకలు చెల్లిపోయాయన్న మంత్రి బొత్స.. భవిష్యత్తు లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో చేసిన ఒక్క మంచి పనినైలా చూపించాలని మంత్రి బొత్స సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఏం చేసిందో క్షేత్రస్థాయిలోకి వస్తే చూపిస్తామని చెప్పారు. సైకోలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చంద్రబాబు రోజురోజుకూ దిగజారిపోతున్నారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఏం చేస్తే వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయో వాటినే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

టీడీపీ పాలనలో చక్రం తిప్పింది చుట్టాలు, పట్టాలు మాత్రమే. అమరావతిలో 30 వేల ఎకరాలు దోచుకున్నారు. చంద్రబాబు కళ్లకు అంతా పచ్చగా కనిపిస్తోంది. వారి లాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దోచుకుంటున్నారంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ పాలనలో కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు ఎలా మంత్రులుగా ఉన్నారో తామూ అలాగే మంత్రులం. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు.

– బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మంత్రి

ఇవి కూడా చదవండి

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కోసం అశోక్ గజపతిరాజు ఏం చేశారని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు పరిపాలనలో రైతులు ఆత్మహత్య చేసుకునేవారని.. ఆయన హయాంలో వ్యవసాయం భ్రష్టు పట్టిపోయిందని దుయ్యబట్టారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీకేల ద్వారానే ఎరువులు, విత్తనాలను అందిస్తున్నామని చెప్పారు. రైతులు ధర్నా చేస్తే చంద్రబాబు కాల్పులు జరిపారని మంత్రి బొత్స గుర్తు చేశారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం