Andhra Pradesh: ఫెయిల్ అయితే బాధపడకండి.. ఎంతో భవిష్యత్తు ఉంది. ‘పది’ విద్యార్థులకు బొత్స సూచన
ఆంధ్రప్రదేశ్‌లో 2023-2023 ఏడాది పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. శనివారం ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో మొత్తం 72.06 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికలే ముందంజలో ఉన్నారు. 933 పాఠశాలల్లో వంద శాతం మంది..
ఆంధ్రప్రదేశ్‌లో 2023-2023 ఏడాది పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. శనివారం ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో మొత్తం 72.06 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలికలే ముందంజలో ఉన్నారు. 933 పాఠశాలల్లో వంద శాతం మంది పాస్ కాగా, 38 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. ఇక మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా ఉండగా చివరి స్థానంలో 60.30 శాతంతో నంద్యాల జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే ఫెయిల్ అయిన విద్యార్థులకు విద్యా సంవత్సరం కోల్పోకుడదనే ఉద్దేశంతో వెంటనే సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మేరకే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి బొత్సా సత్యనారాయణ తెలిపారు. ఫెయిలైన విద్యార్థులకు జూన్ 2వ తేదీ నుంచి 10 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం విద్యార్థులు దరఖాస్తులను ఈ నెల 17 లోపు చేసుకోవాలని.. పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. లేట్ ఫీ రూ.50 లతో మే 22 వరకూ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అని అన్నారు. అదే విధంగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం స్టూడెంట్స్ ఈ నెల 13వ తేదీ లోగా ఫీజు చెల్లించాలని సూచించారు మంత్రి బొత్సా.
ఆత్మహత్యలు వద్దు..
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని మంత్రి బొత్స సూచించారు. విద్యార్థులకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని, సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. విద్యా సంవత్సరం కోల్పోకూడదనే ఉద్దేశంతో త్వరగా సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. అలాగే పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ కోచింగ్ ఇప్పిస్తామని మంత్రి బొత్సా పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా కొన్ని పాఠశాలలను గుర్తించామని.. ఈ స్కూల్స్ లో స్టూడెంట్స్ కు ప్రత్యేక తరగతులు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..