AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM Jagan: ఆ నాలుగు వైసీపీ సీట్లపై స్పెషల్ ఫోకస్.. ఆనంకు చెక్ పెట్టేందుకు ఆ నేతను రంగంలోకి దింపనున్న సీఎం జగన్

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలనేది ఆ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆనం ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది వైసీపీ.. అక్కడ కోఆర్డినేటర్ గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ని నియమించింది.

AP CM Jagan: ఆ నాలుగు వైసీపీ సీట్లపై స్పెషల్ ఫోకస్.. ఆనంకు చెక్ పెట్టేందుకు ఆ నేతను రంగంలోకి దింపనున్న సీఎం జగన్
Cm Jagan Focus On Nellore
Surya Kala
|

Updated on: May 06, 2023 | 1:45 PM

Share

పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఆ నలుగురు విషయాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకుందంట. ఎట్టి పరిస్థితిల్లో ఆయా సీట్లను తామే గెలుచుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తుందట.. వెంకటగిరిలో ఆనంకు చెక్ పెట్టేదుకే బొమ్మిరెడ్డిని పార్టీ లోకి తీసుకున్నారనే చర్చ జరిగుతుంది.. అనుభవం ఉన్న నాయకుడు కావడంతో ఆనంని ఢీ కొట్టగలరని బొమ్మిరెడ్డి పై నమ్మకంతో ఉన్నారంట జగన్..

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలనేది ఆ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆనం ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది వైసీపీ.. అక్కడ కోఆర్డినేటర్ గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ని నియమించింది. అయితే సీనియర్ పొలిటీషియన్ అయిన ఆనం పై గెలవాలంటే అన్ని రకాలుగా బలమైన నాయకుడు ఉండాలనేది.. వైసీపీ ఆలోచన.. అందుకే నెల్లూరు జడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ని పార్టీలోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

వాస్తవంగా బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరినా ఆయన బ్యాక్ గ్రౌండ్ మొత్తం వైసీపీతోనే ఉంది. వైసీపీకి ముందు కాంగ్రెస్ లో పలు పదవుల్లో పనిచేశారు బొమ్మిరెడ్డి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి వెంకటగిరి టిక్కె ఆశించారు. ఎన్నికల్లో గెలుపుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు..కానీ చివరి నిమిషంలో ఆనం కు టిక్కెట్ ఇవ్వడంతో వైసీపీ అధిష్టానం పై అలిగిన బొమ్మిరెడ్డి…టీడీపీ చెంతకు చేరారు. ప్రస్తుతం టీడీపీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం తో అసంతృప్తిగా ఉన్న ఆయన తిరిగి సొంతగూటికి వచ్చేసారట. అయితే టిక్కెట్ విషయంలో మాత్రం కొన్ని రోజులు వేచి ఉండాలని సీఎం జగన్ సూచించినట్లు చర్చ జరుగుతుంది.

టీడీపీ నుంచి బొమ్మిరెడ్డి వైసీపీలో చేరడంతో అక్కడ ప్రత్యర్థి వర్గం బలహీన పడుతుందని లెక్కలు వేస్తుంది వైసీపీ. అయితే ప్రస్తుతం కోఆర్డినేటర్ గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఉండటంతో సీటు కన్ఫర్మ్ చేయడానికి సీఎం జగన్ మరికొన్ని రోజులు తీసుకుంటారని చర్చ జరుగుతుంది. ఆనం టీడీపీలో చేరడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. అందుకే ఆనం ను ఓడించేందుకు నియోజకవర్గంలో బలమైన నాయకులను ఏకం చేసి సీటు దక్కించుకునే ఆలోచనలో ఉందట వైసీపీ..త్వరలోనే బొమ్మిరెడ్డి కి పార్టీ ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తారనేది టాక్.

Reporter…MPRao

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..