Ambati Rambabu: వారిద్దరూ నేరానికి పాల్పడ్డారు.. దానికి చంద్రబాబే కారణం.. అంబటి రాంబాబు ఫైర్

Ambati Rambabu - polavaram project: పోలవరం ప్రాజెక్టును గజిబిజిగా మార్చి, సరైన రీతిలో నిర్మాణం చేపట్టకుండా గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

Ambati Rambabu: వారిద్దరూ నేరానికి పాల్పడ్డారు.. దానికి చంద్రబాబే కారణం.. అంబటి రాంబాబు ఫైర్
Ambati Rambabu

Updated on: Jul 19, 2023 | 12:19 PM

Ambati Rambabu – polavaram project: పోలవరం ప్రాజెక్టును గజిబిజిగా మార్చి, సరైన రీతిలో నిర్మాణం చేపట్టకుండా గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు పోలవరం పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, తాజా వరద పరిస్థితి గురించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తాము చాలా చిత్తశుద్ధి, పూర్తి పారదర్శకతతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు, అప్పటి జలవనరుల శాఖ మంత్రి నేరానికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రాజెక్టు ఆలస్యం కావడానికి, ఇప్పటికీ ముందుకు సాగకపోవడానికి చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాలే కారణమని అంబటి రాంబాబు ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం ప్రొటోకాల్‌కు విరుద్దంగా పనులు చేపట్టిందన్న అంబటి రాంబాబు.. పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయింది.. అంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..