సోము విసిరిన ఆ సవాల్‌పై నవ్వుకుంటున్న మంత్రి.. బీజేపీ బలం ఎంత, బీజేపీ జత కట్టిన జనసేన సత్తా ఎంత అంటూ సెటైర్‌

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఈసారి సవాలు విసరడం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు..

సోము విసిరిన ఆ సవాల్‌పై నవ్వుకుంటున్న మంత్రి.. బీజేపీ బలం ఎంత, బీజేపీ జత కట్టిన జనసేన సత్తా ఎంత అంటూ సెటైర్‌
Follow us
K Sammaiah

|

Updated on: Feb 04, 2021 | 5:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతుంది. ఈసారి సవాలు విసరడం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వంతైంది. ఏపీలో వారసత్వ రాజకీయాలు అంతం చేసే దమ్ముందా అంటూ సోము వీర్రాజు వైసీపీ, టీడీపీలకు సవాల్‌ విసిరారు. అయితే సోము సవాల్‌పై వైసీపీ మంత్రులు నవ్వుకుంటున్నారు.

దమ్ముందా.. మీకు దమ్ముందా? ఉంటే గింటే చంద్రబాబుగానీ, జగన్‌గానీ.. బీసీలను సీఎం చెయ్యగలరా? బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు చాలా సీరియస్‌గా వేసిన ప్రశ్న ఇది. వారసత్వ రాజకీయాలను తమిరికొడదాం, బీజేపీ అందుకు పోరాటం చేస్తోందంటూ చాలా సూటిగా, ఘాటుగా విమర్శించారు సోము వీర్రాజు.

సోము వేసిన ఇదే ప్రశ్నను.. వైసీపీ నేతలు, మంత్రుల ముందు వేస్తే నవ్వుతున్నారు. అసలు బీజేపీ బలం ఎంత, బీజేపీ జత కట్టిన జనసేన సత్తా ఎంత అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఉట్టికెగరలేని వాళ్లకు ఆకాశానికి ఎందుకులే నిచ్చెన అంటూ సెటైర్ వేస్తున్న మంత్రి ఆదిమూలం సురేష్‌ సెటైర్‌ వేస్తున్నారు.

Read more:

పోలవరం గురంచి మట్లాడే అర్హత ఆ పార్టీలకు లేదు.. వారికి రూలింగ్‌ కన్నా ట్రేడింగే ముఖ్యమన్న సోము వీర్రాజు

అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై అయ్యన్న ఆగ్రహం.. నడిరోడ్డుపై నరికేయండ్రా అన్న వ్యక్తిపై చర్యలెందుకు లేవన్న మాజీమంత్రి