అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై అయ్యన్న ఆగ్రహం.. నడిరోడ్డుపై నరికేయండ్రా అన్న వ్యక్తిపై చర్యలెందుకు లేవన్న మాజీమంత్రి

గ్రామాభివృద్ది కోసం రిక్వస్ట్ మేనర్లో మాట్లాడిన టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కేసు ఎందుకు నమోదు చేశారో ప్రజలకు చెప్పాలని..

అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై అయ్యన్న ఆగ్రహం.. నడిరోడ్డుపై నరికేయండ్రా అన్న వ్యక్తిపై చర్యలెందుకు లేవన్న మాజీమంత్రి
Follow us
K Sammaiah

|

Updated on: Feb 04, 2021 | 4:52 PM

గ్రామాభివృద్ది కోసం రిక్వస్ట్ మేనర్లో మాట్లాడిన టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై కేసు ఎందుకు నమోదు చేశారో ప్రజలకు చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్‌ చేశారు. ఇదే గ్రామంలో నడిరోడ్డుపై ఎవడైనా మాట్లాడితే నరికేయండ్రా అన్న వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో డీజీపీ సమాధానం చెప్పాలని అన్నారు.

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా? లేక భారత రాజ్యంగం నడుస్తుందా? అంటూ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చెతితే అరెస్టు చేయడమేనా? రాష్ట్రంలో చట్టాలుండవా? అంటూ డీజీపీని ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో రాక్షస పరిపాలన నడుస్తుంది అంటూ మండిపడ్డారు.

టీడీపీ నేత పట్టాభి ఇంటికెళ్లి ఇనుప రాడ్లతో దాడులు చేయడమా? ఇంత దారుణం ఎక్కడైనా ఉందా?ప్రశాంతమైన ఉత్తరాంధ్రా జిల్లాలను కడప జిల్లాగా మార్చేందుకు ఏ2 విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార పార్టీ నేతలు దీన్ని అడ్డుకోవాలని కోరారు. లేకుంటే ఏదో ఒక రోజు మీకు పట్టాభి లాంటి ఘటనే ఎదురవుతుందని అయ్యన్న అన్నారు.

Read more:

సీఎం జగన్‌ అధ్యక్షతన హైపవర్‌ కమిటీ భేటీ.. గతంతో పోలిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు తగ్గాయన్న మంత్రులు