అందితే జుట్టు.. లేకుంటే కాళ్లు.. ఇదే వారి నైజం.. అమిత్‌షా కారుపై చెప్పులు వేయించిన చరిత్రను మర్చిపోలేదన్న బాలశౌరి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు కులసుకున్న విషయం తెలిసిందే. ఏపీలో శాంతిభద్రతలు..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు కులసుకున్న విషయం తెలిసిందే. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని అమిత్‌షాకు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అయితే ఈ అంశంపై వైసీపీ ఎంపీ బాలశౌరి అభ్యంతరం తెలిపారు.
అందితే జుత్తు… అందకపోతే కాళ్లు అనే సామతె TDPకి సరిగ్గా సరిపోతుందన్నారు వైసీపీ ఎంపీ బాలశౌరి. తిరుపతిలో అమిత్‌షా కారుపై చెప్పులు వేయించిన వాళ్లే ఇప్పుడు ఆయన్ను కలిసి… రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీల తీరును చేస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు.
పక్క రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓటుకు నోటు కేసులో సీబీఐ విచారణ చేయించాలని మోదీని, అమిత్‌షాని, రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు బాలశౌరి. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన విమర్శలను అమిత్‌షాకు, మోదీకి చూపిస్తామన్నారు బాలశౌరి. చంద్రబాబు నైజం ఎలాంటిదో మాకన్నా బీజేపీకే ఎక్కువ తెలుసని బాలశౌరి ఎద్దేవా చేశారు.
Read more: