ఈ నెల 8 వరకు జైల్లోనే అచ్చెన్నాయుడు.. బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా వేసిన సోంపేట కోర్టు
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు సోమవారం వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను..
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు సోమవారం వరకు జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను సోంపేట కోర్టు వాయిదా వేసింది. ఈనెల 8వ తేదీ సోమవారానికి ఈ కేసు విచారణ వాయిదా పడింది. అయితే ఆ రోజునైనా బెయిల్ వస్తుందా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.
తన బంధువు కింజారపు అప్పన్నను బెదిరించిన కేసులో అరెస్ట్ అయ్యారు అచ్చెన్నాయుడు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు తనను బెదిరించారని అచ్చెన్నపై ఫిర్యాదు చేశారు అప్పన్న. ఈ కేసులో అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్‌లో విధించింది కోర్టు.
అయితే అచ్చెన్నాయుడిని విడుదల చేయాలంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎనమిదో తేదీకి వాయిదా వేసింది. దీంతో మరో నాలుగు రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read more:
పంచాయతీ ఎన్నికలపై ఆ పిటిషన్‌ను కొట్టి వేసిన ఏపీ హైకోర్టు.. పిటిషనర్ వాదనతో ఏకీభవించని ధర్మాసనం