ఉపాధి కోసమని వస్తే ఇంత దారుణమా.. పక్క రాష్ట్రంలో సిక్కోలు మత్స్యకారులపై దాడి.. కొట్టొద్దని వేడుకున్నా..
ఉపాధి కోసం వలస వెళ్లిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులపై కర్ణాటక రాష్ట్ర మత్స్యకారులు దాడి చేశారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ఫిషింగ్ హార్బర్‌లో ఈనెల 8న జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో సిక్కోలు జిల్లా మత్స్యకారులపై జరిగిన దాడి శ్రీకాకుళం జిల్లాలోను పెద్ద చర్చకు దారి తీస్తుసింది

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరు పాలెం కొత్త ముక్కాం, ఎచ్చెర్ల మండలండి. మత్స్యలేశం, బదివానిపేట గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఉపాధి నిమిత్తం కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. ఈనెల 8న మంగళూరు ఫిషింగ్ హార్బర్‌లో వీరు బోటును లంగరు వేసి, తాడుతో కట్టారు. అయితే పక్కన ఉన్న మంగళూరు మత్స్య కారులు బోటు వీరి బోటును ఢీ కొట్టింది. దాంతో బోటుకు కట్టిన తాడు తెగిపోయి లోపల ఉన్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు తగిలింది. ఆ విషయమై అడగగా మమ్మల్ని నిలదీస్తారా అంటూ విచక్షణా రహితంగా మంగుళూరు మత్స్యకారులు బోటులో ఉండే తెడ్డులు, ఇతర పరికరాలతో శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులపై దాడి చేశారు. వారు తమని కొట్టవద్దని బతిమలాడుతున్న వినకుండా విచక్షణా రహితంగా కొట్టారు. అయితే మంగళూరు మత్స్యకారుల దాడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని సిక్కోలు జిల్లా మత్స్యకారులు చెబుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులపై మంగళూరు మత్స్యకారులు దాడి చేసిన వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉపాధి కోసం వలస వెళ్లిన వారిని విచక్షణా రహితంగా అలా కొట్టటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పేరుకి 193 కిలో మీటర్ల పొడవున సువిశాల సముద్రం తీరం ఉన్నప్పటికీ.. జిల్లాలో ఎక్కడ ఒక్క జెట్టి గానీ, ఫిషింగ్ హార్బర్ గానీ లేదని మండిపడుతున్నారు.
ఈ కారణం వల్లే కళ్ళ ముందు సముద్రం ఉన్నా.. ఉపాధి కోసం ఎక్కడో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నై వంటి రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళుతున్నామని.. అక్కడ అనేక అవమానాలు పడుతున్నామని సిక్కోలు జిల్లా మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల వలసలను తగ్గించేలా జిల్లాలో జెట్టి నిర్మాణం , హార్బర్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




