AP Crime: పెళ్లైన నెలకే పుట్టింటికి వెళ్లిన భార్య.. చివరకు భర్త ఏం చేశాడంటే..

|

Jan 18, 2022 | 9:29 AM

Anantapur District: ఏపీలోని అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రాలేదని భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లైన నెలకే

AP Crime: పెళ్లైన నెలకే పుట్టింటికి వెళ్లిన భార్య.. చివరకు భర్త ఏం చేశాడంటే..
Suicide
Follow us on

Anantapur District: ఏపీలోని అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రాలేదని భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లైన నెలకే భార్య విడిచిపెట్టిపోవడంతో మనస్థాపానికి గురైన ఆ యువకుడు ఈ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జిల్లాకు చెందిన భాస్కర్‌ (28) కు రెండేళ్ల క్రితం పెళ్లైంది. ఈ క్రమంలో పెళ్లైన నెలరోజులకే భార్య వదిలిపెట్టి వెళ్లిపోయిందని మృతుడి తల్లిదండ్రులు చిన్నవీరన్న, గుర్రమ్మ పేర్కొన్నారు. అప్పటినుంచి తీవ్ర మనోవేదన చెందేవాడని తెలిపారు. ఎన్ని సార్లు కబురు పంపినా భార్య కాపురానికి రాకపోవడంతో భాస్కర్ మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో భాస్కర్‌ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

గమనించిన కుటుంబసభ్యులు భాస్కర్‌ను ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయాడు. ఈ ఘటన అనంతరం కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Chandrababu Naidu: రాజకీయ నేతలను వెంటాడుతున్న కరోనా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు పాజిటివ్..

Bangarraju: టికెట్ల విషయంలో ఘర్షణ.. ఇదేంటని ప్రశ్నిస్తే దుర్భాషలాడిన వైనం.. పోలీసుల ఎంట్రీతో..