Vijayawada: విజయవాడ శిఖామణి సెంటర్‌లో మహిళ మృతి.. హత్యాచారమా?, ప్రమాదమా?..

Vijayawada: విజయవాడ శిఖామణి సెంటర్‌లో అనుమానాస్పద మృతి చెందిన మహిళ సమాచారాన్ని గుర్తించారు పోలీసులు.

Vijayawada: విజయవాడ శిఖామణి సెంటర్‌లో మహిళ మృతి.. హత్యాచారమా?, ప్రమాదమా?..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 18, 2022 | 12:41 PM

Vijayawada: విజయవాడ శిఖామణి సెంటర్‌లో అనుమానాస్పద మృతి చెందిన మహిళ సమాచారాన్ని గుర్తించారు పోలీసులు. మృతి చెందిన మహిళను గుంటూరులోని ఏటి అగ్రహారంకి చెందిన చదలవాడ తనూజ కృష్ణగా గుర్తించారు. తనూజకు 2018లో సాయి మణికంఠ అనే వ్యక్తితో వివాహం జరుగగా.. వారికి ఒక బాబు ఉన్నాడు. అయితే, ఈ నెల 17వ తేదీన నగరపాలెం పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. అదేరోజు రాత్రి విజయవాడ శిఖామణి సెంటర్‌లో తెల్లవారు జామున గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిన స్థితిలో తనూజ మృతదేహం లభ్యమైంది. తలకు బలమైన గాయం అవడంతో మృతిచెందినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న మాచవరం పోలీసులు.. తొలుత గుర్తు తెలియని మహిళగా భావించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు వివరాలు తెలియడంతో.. కేసును మరింత సీరియస్‌గా తీసుకున్నారు పోలీసులు. తనూజ ప్రమాదవశాత్తు మరణించిందా? అత్యాచారం చేసి హత్య చేశారా అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు. శిఖామణి సెంటర్ పరిసరాల్లోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also read:

Covid – Protien: కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత ప్రోటీన్ ఫుడ్ తప్పనిసరి.. ఎందకంటే..

Bank Charges: మీకు ఆ బ్యాంకులో అకౌంట్‌ ఉందా…? ఛార్జీల మోత.. తెలుసుకోండి పూర్తి వివరాలు..!

Sr. NTR Death Anniversary: ఎన్టీఆర్‌ గురించి చెప్పాలంటే మహా, మెగా లాంటి పదాలు సరిపోవు…