AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Naidu: రాజకీయ నేతలను వెంటాడుతున్న కరోనా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు పాజిటివ్..

Chandrababu Naidu tests covid-19: ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. థర్డ్‌వేవ్‌లో కూడా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా

Chandrababu Naidu: రాజకీయ నేతలను వెంటాడుతున్న కరోనా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు పాజిటివ్..
Chandrababu Naidu
Shaik Madar Saheb
|

Updated on: Jan 18, 2022 | 8:49 AM

Share

Chandrababu Naidu tests covid-19: ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. థర్డ్‌వేవ్‌లో కూడా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినే నారా చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు. కొన్ని లక్షణాలు కనిపించగా.. కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వెల్లడించారు. ఈ రిపోర్టులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. కాగా.. చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. లక్షణాలు కనిపించగా.. టెస్ట్ చేయించుకుంటే.. పాజిటవ్‌గా నిర్ధారణ అయినట్లు లోకేష్ సోమవారం తెలిపారు. ఆ మరుసటి రోజు చంద్రబాబుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లోకేష్‌కు పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఇంట్లో ఉన్నవారంతా పరీక్షలు చేయించుకున్నారు.

ఈ మేరకు చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ట్విట్ చేసి వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు కనిపించగా.. పరీక్ష చేయించుకుంటే.. కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్ అయ్యానని.. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. తనతో కాంటాక్ట్‌లో ఉన్నవారు వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని చంద్రబాబు సూచించారు. జాగ్రత్త వహించండి.. సురక్షితంగా ఉండండి అంటూ చంద్రబాబు ట్విట్ చేశారు.

ఇదిలాఉంటే.. అంతకుముందు టీడీపీ నాయకుడు వంగవీటి రాధా కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనతోపాటు ఏపీ మంత్రి కొడాలి నానికి కూడా వైరస్ సోకింది. దీంతో వారిద్దరూ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

Also Read:

Fatty Liver Disease: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే.. ఈ పదార్థాలను అస్సలు ముట్టుకోకండి..

Weight Loss Tips: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా..? కలబందను ఇలా ఐదు పద్దతుల్లో తీసుకోండి..