Tadepalligudem: ఉదయం భార్యను ముక్కలు ముక్కలుగా నరికాడు.. సాయంత్రం భయంతో…
భర్తతో వేగలేక గతంలో జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లింది నిర్మల. ఆమె తనకు డబ్బులు పంపకపోవడంతో భార్యను ఎలాగైనా దుబాయ్ నుంచి రప్పించాలనే ఉద్దేశంతో కుమార్తెలను విచక్షణరహితంగా కొడుతూ.. చంపేస్తానని కత్తితో బెదిరిస్తూ.. గతంలో హల్‌చల్ చేశాడు దావీదు. ఆ కేసుపై అరెస్టై.. ఇటీవల విడుదలయ్యాడు.

అతడి విచక్షణలేని ధోరణి… పదేళ్ల లోపున్న ముగ్గురు పిల్లలకు తల్లీతండ్రిని లేకుండా చేసింది. వారిలో ఇద్దరు ఆడపిల్లలు. ఒకేరోజు తల్లీతండ్రిని కోల్పోయి అనాథలుగా మారారు పిల్లలు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో జరిగింది ఈ విషాద ఘటన. మద్యానికి బానిసయిన గంజి దావీదు జంతువు కంటే ఘోరంగా ఉన్మాదిగా మారి భార్యను అత్యంత కిరాతంగా మర్డర్ చేశాడు. శుక్రవారం ఉదయం ముక్కలు ముక్కలు నరికి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులకు భయపడి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు నిందితుడు.
గతంలోనూ విపరీత ప్రవర్తనతో హల్‌చల్ చేశాడు గంజి దావీదు. భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. దీంతో ఆమె కువైట్ వెళ్లిపోయింది. దీంతో పగతో రగిలిపోయిన దావీదు కన్నకూతుళ్లను చితక్కొట్టి వీడియో వైరల్ చేశాడు. డబ్బు పంపకపోతే పిల్లల్ని చంపేస్తానంటూ కువైట్‌లో ఉంటున్న భార్యను అప్పట్లో బెదిరించాడు. ఈ ఇన్సిడెంట్ అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. వీడియో వైరల్ కావడంతో.. ఇదే కేసులో పోలీసులు అతడ్ని జైల్లో పెట్టారు. ఆ తర్వాత నిర్మల కూడా కువైట్ నుంచి వచ్చి అమ్మగారింట్లో ఉంటోంది.
2 నెలల క్రితం బెయిల్‌పై రిలీజైన దావీదు తాను మారనని నమ్మబలికాడు. బుద్ధిగా ఉంటానంటూ భార్య ముందు ప్రాధేయపడ్డాడు. బతిమిలాడి మరీ భార్యను 3 రోజుల క్రితం తన ఇంటికి తీసుకొచ్చాడు. మంచిగా నటిస్తూ అదునుచూసి.. ఆమెను దారుణాతి దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత తానూ సూసైడ్ చేసుకున్నాడు. దాంతో, పిల్లలు అనాథలుగా మారారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




