Big News Big Debate: ఏపీలో ఎన్నికలకు ఏడాది టైమ్..  ఫుల్‌ యాక్టీవ్ అయిన పార్టీలు.. అస్త్రాలతో రెడీ

Big News Big Debate: ఏపీలో ఎన్నికలకు ఏడాది టైమ్.. ఫుల్‌ యాక్టీవ్ అయిన పార్టీలు.. అస్త్రాలతో రెడీ

Ram Naramaneni

|

Updated on: Apr 28, 2023 | 7:06 PM

జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ వైసీపీ సంక్షేమ పథకాలపై ప్రచారాన్ని గడపగడపకు తీసుకెళుతోంది. దాదాపు 7లక్షల మంది కార్యకర్తలు మహాయజ్ఞంలో పాల్గొంటున్నారు. కోటీ 60లక్షల కుటుంబాలను టచ్‌ చేసి ప్రజామోదంతో ఇంటింటికి స్టిక్కర్లు కూడా అంటిస్తున్నారు. పోటీగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ జిల్లా జిల్లా తిరుగుతున్నారు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు.

జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ వైసీపీ నేతలు ఇంటింటి తలుపు తడుతూ మద్దతు కూడగడుతున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు కూడా స్పీడు పెంచారు. ఈ పొలిటికల్‌ యాక్షన్‌లోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చింది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఛార్జిషీట్లు వేసేందుకు ప్రత్యేక బలగాలను రంగంలో దింపింది. జాతీయ నాయకుల నుంచి జిల్లా నాయకుల వరకూ అందరికీ యాక్టివేట్‌ చేస్తోంది. అయితే బీజేపీ రోడ్‌ మ్యాప్‌ అడిగిన పవన్‌.. ప్రచారానికి దూరంగా ఉన్నారు. పైగా పొత్తులపై త్వరలో నిర్ణయం అంటూ ప్రకటన విడుదల చేశారు.

Published on: Apr 28, 2023 06:56 PM