AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Duvvada Srinivas: దువ్వాడ శ్రీను, నేను కలిసే ఉంటున్నాం.. సుప్రీం కోర్టే చెప్పింది.. తప్పేముంది : మాధూరి

సంచలనం రేపిన దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూలో  తన వెర్షన్‌ విన్పించారు మాధురి. వాణి ఆహ్వానంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు మాధురి.  దువ్వాడ శ్రీనివాస్‌ తను కలిసి వుంటున్నది నిజమేనన్నారామె. ఈ పరిస్థితిని సృష్టించింది వాళ్లేనంటూ  వాణిపై  ఆరోపణలు చేశారామె.  

Duvvada Srinivas: దువ్వాడ శ్రీను, నేను కలిసే ఉంటున్నాం.. సుప్రీం కోర్టే చెప్పింది.. తప్పేముంది : మాధూరి
Madhuri
Ram Naramaneni
|

Updated on: Aug 09, 2024 | 7:26 PM

Share

దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ కుటుంబ కథా చిత్రమ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగుచూస్తున్నాయి. దువ్వాడ వాణి తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు..మాధురి. దువ్వాడ వాణి పిలుపుతోనే తాను వైసీపీలో చేరానని.. ఇప్పుడు తాను ఎవరో తెలియదంటున్నారని విమర్శించారు. వాణి తన స్వార్థం కోసం తనపై నిందలు వేశారని.. తన వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీసిందని… ఆ బాధతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు. అలాంటి సమయంలో దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచారని.. ఓ ఫ్రెండ్‌లా, కేర్‌టేకర్‌గా దువ్వాడ శ్రీను తనతో ఉన్నారంటున్నారు మాధురి. ప్రస్తుతం దువ్వాడ శ్రీను, తాను కలిసే ఉంటున్నట్లు స్పష్టం చేశారు.

నివురు గప్పిన నిప్పు తాజాగా భగ్గుమంది. అర్ధరాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటి ముందు ఆయన ఇద్దరు కూతుళ్ల ఆందోళనతో టోటల్‌ పిక్చర్‌ రచ్చకెక్కింది. నిజానికి మాధురి-దువ్వాడ మధ్య మ్యాటర్‌   గడప గడప కార్యక్రమం టైమ్‌లోనే బయటపడింది. ఇక దువ్వాడతో కలిసి వుండడం కల్ల అని స్పష్టం చేశారు వాణీ. ఆయన వల్ల కుటుంబం పరువుపోతుందని వాపోయారామె. ఆయన వల్త తమకు ఎలాంటి ఆస్తులు రాలేదన్నారు. తన రాజకీయాల వల్ల ఆర్దికంగా ఎంతో నష్టపోయామన్నారు. దువ్వాడ శ్రీనివాస్‌ టెక్కలి వదలి వెళ్లాలని డిమాండ్‌ కూడా చేశారు వాణి.

సంచలనం రేపిన  ఈ ఇష్యూలో  తన వెర్షన్‌ విన్పించారు మాధురి. వాణి ఆహ్వానంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు మాధురి .  దువ్వాడ శ్రీనివాస్‌ తను కలిసి వుంటున్నది నిజమేనన్నారామె. ఈ పరిస్థితిని సృష్టించింది వాళ్లేనంటూ  వాణిపై  ఆరోపణలు చేశారామె. ఎవరి వాదన వారిదే.. మొత్తానికి ఇన్నాళ్లు అణిగిమణిగి ఉన్న వ్యవహారం వెనుక అసలు నిజం ఏంటో  పరస్పర వాదనలతో తెరపైకి వచ్చింది.  సహజీవనం కాదు తమది అడల్ట్రీ రిలేషన్‌ అని కుండబద్దలు కొట్టారు మాధురి.  ఇక ఆయనతో కలిసి వుండడం కల్లా అంటున్నారు వాణీ.  కూతుళ్లు మాత్రం నాన్న కావాలంటున్నారు. మరి ఈ కుటుంబ వివాదచిత్రమ్‌ సెంటర్‌ పాయింట్‌గా నిలిచిన దువ్వాడ వారి మాటేంటి?  త్వరలో వివరణ ఇస్తానన్నారే కానీ  తాజా రచ్చపై  దువ్వాడ మాత్రం ఇంకా మౌనం వీడలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..