AP Rains: ఏపీకి మరో వర్ష గండం.. అమ్మబాబోయ్.! ఈ ప్రాంతాల్లో నాన్‌స్టాప్ వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
ఏపీకి వర్షాలు ఇంకా తగ్గలేదు.. ఏపీలోని ఆ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 3 రోజుల వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి.. ఈ స్టోరీ చదివేయండి.
దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలు మీదుగా ఉపరితల ఆవర్తనం సుమారు నవంబర్ 21న ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయణించి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నవంబర్ 23న అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది అదే దిశగా కదులుతూ, తదుపరి రెండు రోజులలో మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా
శ్రీలంక, తమిళనాడు, కేరళ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని చెప్పింది. ఈ నెల 26 నుంచి 3 రోజులు ఏపీ వర్షాలు కురుస్తాయంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. మరి వచ్చే మూడు రోజుల వాతావరణం ఎలా ఉందంటే..
ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ:- —————————————-
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
వాతావరణము పొడిగా ఉండే అవకాశముంది.
ఇది చదవండి: బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..
నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి నవంబర్ 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆతదుపరి 2 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. #WeatherUpdate pic.twitter.com/X3Ku0N1plH
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) November 19, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి