Andhra Pradesh: దేశంలోనే మరో పొడవైన, ఎత్తైన రైల్వే వంతెన.. ఎక్కడో కాదు ఏపీలోనే

| Edited By: Aravind B

Aug 29, 2023 | 5:53 PM

దేశంలోనే అతి పొడవైన రైల్వే వంతెన కేరళలోని వెంబనాడ్ వద్ద ఉంది. ఇపుడు అంతకన్నా పెద్దది అనడం కన్నా ఎత్తైన, భిన్నమైన రైల్వే ఫ్లయ్ ఓవర్ నిర్మాణం పూర్తయింది. ఇంతకు ఆ వంతెన ఎక్కడ ఉంది.. దాని ప్రత్యేకత ఏంటో ఇప్పడు తెలుసుకుందాం. దేశంలో అత్యంత ఎత్తైన కొండ ప్రాంతాల్లోనూ, నదులపైన రైల్వే వంతెనలు చాలానే ఉన్నాయి. అతి పొడవైన వంతెన కేరళలోని కొచ్చి ప్రాంతంలో ఉంది. సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వంతెన నీటి సరస్సుపై ఉంటుంది. కానీ అంత పొడవు కాకున్నా మరో పెద్ద వంతెన ఉంది.

Andhra Pradesh: దేశంలోనే మరో పొడవైన, ఎత్తైన రైల్వే వంతెన.. ఎక్కడో కాదు ఏపీలోనే
Flyover
Follow us on

దేశంలోనే అతి పొడవైన రైల్వే వంతెన కేరళలోని వెంబనాడ్ వద్ద ఉంది. ఇపుడు అంతకన్నా పెద్దది అనడం కన్నా ఎత్తైన, భిన్నమైన రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. ఇంతకు ఆ వంతెన ఎక్కడ ఉంది.. దాని ప్రత్యేకత ఏంటో ఇప్పడు తెలుసుకుందాం. దేశంలో అత్యంత ఎత్తైన కొండ ప్రాంతాల్లోనూ, నదులపైన రైల్వే వంతెనలు చాలానే ఉన్నాయి. అతి పొడవైన వంతెన కేరళలోని కొచ్చి ప్రాంతంలో ఉంది. సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వంతెన నీటి సరస్సుపై ఉంటుంది. కానీ అంత పొడవు కాకున్నా మరో పెద్ద వంతెన.. అది కూడా భిన్నమైన వంతెన.. ఇప్పుడు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని గూడూరు, నెల్లూరు జిల్లాలోని మనుబోలు రైల్వేస్టేషన్ల మధ్య నూతనంగా నిర్మించిన 2.2 కిలోమీటర్ల రైల్వే ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది.

అది కూడా కింద రైల్వే లైన్.. ఫ్లయ్ ఓవర్‎పై కూడా రైల్వే ట్రాక్.. అలా అని వేర్వేరు మార్గం కూడా కాదు. విజయవాడ చెన్నై వెళ్లే మార్గమే. గూడూరు – మనుబోలు మధ్య నిర్మించిన రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్) జోన్ లోనే అతి పొడవైనదిగా గుర్తింపు పొందినట్టు రైల్వే అధికారులు తెలిపారు. రెండేళ్లలోనే ఆర్వోఆర్ పనులు పూర్తిచేసిన రైల్ వికాస్ నిగమ్ లిమిలెడ్ అధికారులు తక్కువ సమయంలోనే ఈ నిర్మాణ పనులను పూర్తి చేశారు. విజయవాడ- గూడురు మధ్య మూడో లైను పనులు కోసం దక్షిణ మధ్య రైల్వే రూ.3,240 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మించినట్లు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 32.5 టన్నుల యాక్సిల్ లోడుతో రైళ్లు సజావుగా నడిపేలా వంతెన నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. గూడురు రైల్వే జంక్షన్ పరిధిలో అత్యధికంగా రైళ్ల రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో ఫ్లైఓవర్ ఎంతగానో ఉపయోగపడుతుందని జీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో విజయవాడ- రేణిగుంట, చెన్నై- విజయవాడ మధ్య ఎలాంటి అంతరాయం లేకుండా రైళ్ల రాకపోకలు సాగుతాయని.. ఈ మార్గంలో రైళ్ల సగటు వేగం కూడా మెరుగవుతుందని రైల్వే అధికారులు అంటున్నారు. ఇక మరో ప్రయోజనం కూడా ఈ భారీ వంతెన వల్ల ఉంది. అదే విజయవాడ నుంచి గూడూరు మీదుగా వెళ్లే రైళ్ల ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండనుంది. కొత్తగా నిర్మించిన ఈ వంతెన గూడూరు వరకు ఎడమ వైపు ఉండగా.. ఇక్కడ రైల్వే ట్రాక్ పై నుంచే కుడి వైపుకు వెళుతుంది. దీంతో తిరుపతి రైళ్లకు ఆలస్యం లేకుండా ఉంటుంది. ఇక ఇదే ప్రాంతంలో వరదలు వచ్చిన ప్రతి సారి ట్రాక్ పైకి వరదనీటి కారణంగా రైళ్ల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అలాంటప్పుడు ఈ వంతెన అత్యవసర మార్గంగా ఉపయోగపడుతుందని ప్రయాణికులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..