Big News Big Debate: పొలిటికల్‌ గోల్‌మాల్‌..! దొంగ ఓట్లు చేర్చారా? ఉన్న ఓట్లు తొలగించారా..

Big News Big Debate: ఏపీలో బోగస్‌ ఓట్ల వివాదం ఢిల్లీకి చేరింది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీలు పోటాపోటీగా భారత ఎన్నికల ప్రధాన కమిషన్‌ను కలిసి మరీ ఫిర్యాదులు చేశారు. టీడీపీ సానుభూతి పరులు ఓట్లు గల్లంతు అవుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో టీడీపీ చేర్చిన దొంగ ఓట్లు పోతుంటే చంద్రబాబు వణుకుతున్నారంటోంది వైసీపీ. అటు బీజేపీ కూడా ఓటర్ల జాబితాలో అక్రమాలపై స్వరం పెంచుతోంది.

Big News Big Debate: పొలిటికల్‌ గోల్‌మాల్‌..! దొంగ ఓట్లు చేర్చారా? ఉన్న ఓట్లు తొలగించారా..
Big News Big Debate
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 29, 2023 | 7:54 PM

Big News Big Debate: ఏపీలో బోగస్‌ ఓట్ల వివాదం ఢిల్లీకి చేరింది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీలు పోటాపోటీగా భారత ఎన్నికల ప్రధాన కమిషన్‌ను కలిసి మరీ ఫిర్యాదులు చేశారు. టీడీపీ సానుభూతి పరులు ఓట్లు గల్లంతు అవుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. గతంలో టీడీపీ చేర్చిన దొంగ ఓట్లు పోతుంటే చంద్రబాబు వణుకుతున్నారంటోంది వైసీపీ. అటు బీజేపీ కూడా ఓటర్ల జాబితాలో అక్రమాలపై స్వరం పెంచుతోంది.

ఓటర్ల జాబితాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఢిల్లీకి చేరిన పంచాయితీ.. ఏపీలో ఓటర్ల జాబితాల్లో అక్రమాలంటూ అధికార, విపక్షాలు పోటాపోటీగా ఎన్నికల కమిషన్‌కు వద్దకు ఫిర్యాదులతో క్యూ కట్టాయి. 15లక్షల కు పైగా ఓట్లు గోల్‌మాల్‌ అయ్యాయంటోంది టీడీపీ. వాలంటీర్ల సాయంతో డేటా సేకరించి ప్రైవేటు ఏజెన్సీకి పంపిస్తున్నారని… అక్కడి నుంచే టీడీపీ, ఇతర పార్టీల ఓటర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు చంద్రబాబునాయుడు. ఉరవకొండలోదొంగ ఓట్ల వ్యవహారమే నిదర్శనమన్న టీడీపీ.. రాష్ట్రవ్యాప్తంగా పరిశీలన జరపాలని కోరుతున్నారు.

అటు టీడీపీ గళానికి బీజేపీ కూడా స్వరం కలిపింది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని.. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటోంది కమలం పార్టీ..

టీడీపీ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు సీఎం జగన్‌. అటు వైసీపీ ఎంపీలు సైతం ఎన్నికల కమిషన్‌ వద్ద ఫిర్యాదులు ఇచ్చారు. 2015 నుంచి ఓటర్ల జాబితా అక్రమాలు చోటుచేసుకున్నాయని.. స్థిరనివాసం లేనివాళ్లకు ఓట్లు ఇచ్చారన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. సేవామిత్ర, మై టీడీపీ యాప్‌ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారన్న వైసీపీ ఎంపీలు ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు.

ఇంతకీ విపక్షాలు చెబుతున్నట్టు 15లక్షల ఓట్లు గోల్‌ మాల్‌ సాధ్యమా? నిజంగా జరుగుతున్నాయా? అదే నిజమైతే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఏం చేస్తున్నట్టు?

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..