ఒకప్పుడు బోయింగ్ 707 కలిగిన ఉన్న పాల్.. ప్రస్తుత ఆస్తుల విలువ ఎంతో తెల్సా..?

విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. కేఏ పాల్‌ పేరిట ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయి. కాగా కేఏ పాల్ అధ్యక్షుడిగా ఉన్న ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది.

ఒకప్పుడు బోయింగ్ 707 కలిగిన ఉన్న పాల్.. ప్రస్తుత ఆస్తుల విలువ ఎంతో తెల్సా..?
Ka Paul
Follow us

|

Updated on: Apr 19, 2024 | 2:30 PM

విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో స్థిర, చరాస్తులు, కేసుల వివరాలను పొందుపరుస్తారు. అయితే ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో బాగా పాపులర్ అయిన వ్యక్తి పాల్. వివిధ దేశాల అధ్యక్షులతో పరిచయాలు ఉన్న మత ప్రబోధకుడు. ప్రపంచంలో బోయింగ్ 707 విమానం కలిగి ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం సమర్పించిన అఫిడవిట్‌లో తన వద్ద కేవలం… రూ.1.86 లక్షల నగదు మాత్రమే ఉన్నట్లు చూపించారు. తన వద్ద రూ.49 వేలు, HDFC బ్యాంకు అక్కయ్యపాలెం బ్రాంచి, విశాఖ ఫెడరల్‌ బ్యాంకు , సికింద్రాబాద్‌ బ్రాంచీల్లో గల అకౌంట్లలో రూ.1,37,071…మొత్తం రూ.1,86,071 నగదు ఉన్నట్టు అఫిడవిట్‌లో చూపించారు.

రుణాలతో పాటు.. వాహనాలు, స్థిరాస్తులు లేవని పేర్కొన్నారు. ఇక పాల్ డిగ్రీ సెకండ్ ఇయర్‌లోనే చదవు ఆపేసినట్లు పేర్కొన్నారు.  ఇక పాల్‌పై తెలుగు రాష్ట్రాల్లోని.. మహబూబ్‌నగర్‌, ఒంగోలు, రాజన్న సిరిసిల్ల,  ఎల్‌.కోట, నల్గొండ ప్రాంతాల్లో ఆరు కేసులున్నాయి. 1981లో ఇంటర్‌ పాసయిన పాల్‌…అనకాపల్లి ఏఎంఎఎల్‌ కాలేజీలో డిగ్రీలో చేరి మధ్యలోనే చదువుకు పులుస్టాప్ పెట్టారు.

తాను పార్లమెంటు సభ్యునిగా గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తానని కేఏ పాల్ చెబుతున్నారు. తమ పార్టీ టిక్కెట్ల కోసం మూడు వేల మంది అర్జీ పెట్టుకున్నారని, అందులో అర్హులైన క్యాండిడేట్లను ఎంపిక చేసి రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దించుతామన్నారు. ఆయన ఎన్నికల ప్రచార గీతాన్ని కూడా ఇటీవల విడుదల చేశారు. గతంలో కేఏ పాల్  ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తు ఉండేది. అయితే తాజాగా ఎన్నికల సంఘం కుండ గుర్తును కేటాయించారు.  గ్లాసులు పగిలిపోతున్నాయని.. సైకిళ్లకు ప్రమాదాలు జరుగుతున్నాయన్న కేఏ పాల్.. ఫ్యాన్లకు ఉరివేసుకుని ప్రజలు చనిపోతున్నారని సెటైర్లు పేల్చారు. కుండలను తీర్చిదిద్దే కుమ్మరిలా.. తాను కూడా ఆంధ్రా ప్రజల జీవితాలను తీర్చిదిద్దుతానని కేఏ పాల్ హామీ ఇస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..