తిరుమలలో చిరుత కలకలం.. మెట్లమార్గంలో దుప్పిని పీక్కుతిని..!

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం సృష్టించింది. సోమవారం చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలోని 270 మెట్టు వద్ద ఒక దుప్పిని చిరుత చంపి తినింది. మెట్లపై రక్తపు మరకలు చూసిన భక్తులు షాక్‌కి గురయ్యారు. వెంటనే స్థానిక అటవీశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే వారు ప్రమాద స్థలానికి చేరుకుని దుప్పిని.. తీసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేశారు. కొంత సమయం మెట్ల మార్గంలో భక్తుల్ని అనుమతించ లేదు. అయితే.. చిరుత […]

తిరుమలలో చిరుత కలకలం.. మెట్లమార్గంలో దుప్పిని పీక్కుతిని..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 17, 2020 | 9:45 PM

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం సృష్టించింది. సోమవారం చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలోని 270 మెట్టు వద్ద ఒక దుప్పిని చిరుత చంపి తినింది. మెట్లపై రక్తపు మరకలు చూసిన భక్తులు షాక్‌కి గురయ్యారు. వెంటనే స్థానిక అటవీశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే వారు ప్రమాద స్థలానికి చేరుకుని దుప్పిని.. తీసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేశారు. కొంత సమయం మెట్ల మార్గంలో భక్తుల్ని అనుమతించ లేదు. అయితే.. చిరుత సంచరిస్తుందని తెలుసుకున్న భక్తుల్లో తీవ్ర భయాందోళన చెందారు.

కాగా.. కాలినడకన తిరుమల కొండపైకి చేరుకోవాలంటే రెండు మార్గాలుంటాయి. ఒకటి అలిపిరి మార్గం కాగా, రెండోవది శ్రీవారి మెట్టు మార్గం. వీటిల్లో అలిపిరి మార్గం 24 గంటలూ అందుబాటులో ఉండగా.. మెట్ల మార్గం మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకూ తెరిచి ఉంటుంది. రాత్రి వేళల్లో భక్తులను అక్కడికి అనుమతించారు. రెండు ప్రాంతాలూ ప్రమాదకరమైన అటవీ ప్రాంతాలే. అక్కడక్కడ భక్తులపై ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగాయి.